సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు ఇంటిగ్రేటెడ్ భవనాలు

సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు  ఇంటిగ్రేటెడ్ భవనాలు

 

  • రాష్ట్రంలోని అన్ని కార్యాలయాలకూ విడతల వారీగా నిర్మాణం: పొంగులేటి 
  • ఫస్ట్ ఫేజ్  కింద గ్రేటర్ పరిధిలోని9 చోట్ల ఇంటిగ్రేటెడ్ భవనాలు
  • త్వర‌‌లో గ‌‌చ్చిబౌలిలో శంకుస్థాపనకు ఏర్పాట్లు 

హైదరాబాద్, వెలుగు: ఇప్పటికే స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకొచ్చి ప్రజలకు మెరుగైన సేవ‌‌లు అందిస్తున్న స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష‌‌న్స్ శాఖ మ‌‌రో ముందడుగు వేసింది. ప్రజలకు మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా ఒకేచోట సేవలను అందించడానికి వీలుగా సబ్- రిజిస్ట్రార్ కార్యాలయాలను పునర్వ్యవస్థీకరించడం(రీఆర్గనైజేషన్)తో పాటు కార్పొరేట్ స్థాయిలో అత్యాధునిక సౌకర్యాలతో ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను నిర్మించాల‌‌ని నిర్ణయించింది. శనివారం సెక్రటేరియెట్లో రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నతాధికారులతో రివ్యూ నిర్వహించారు. సమావేశానికి రెవెన్యూ కార్యద‌‌ర్శి డీఎస్ లోకేశ్ కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ రాజీవ్ గాంధీ హనుమంతు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ఆలోచ‌‌న‌‌ల‌‌కు అనుగుణంగా ప్రజ‌‌ల‌‌కు అసౌక‌‌ర్యం క‌‌ల‌‌గ‌‌కుండా, ప‌‌రిపాల‌‌న‌‌కు ఇబ్బంది లేకుండా సబ్–రిజిస్ట్రార్ కార్యాలయాల పునర్వ్యవస్థీకరణ, కొత్త బిల్డింగ్ ల నిర్మాణం ఉండాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉండగా.. వాటిలో 37 ఆఫీసులకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయన్నారు. ఉన్నాయని మిగిలినవన్నీ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయని తెలిపారు. అందుకే దశలవారీగా అన్ని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయాలకు కార్పొరేట్ స్థాయిలో భవనాలు నిర్మిస్తామన్నారు. మొద‌‌టి విడ‌‌త‌‌లో ఔట‌‌ర్ రింగ్ రోడ్డు ప‌‌రిధిలో నాలుగు లేదా ఐదు స‌‌బ్ రిజిస్ట్రార్ ఆఫీసులను ఒకేచోట నిర్మిస్తామని తెలిపారు. 

తొలి విడతలో 9 చోట్ల.. 

హైద‌‌రాబాద్ జిల్లాలో 11 స‌‌బ్ రిజిస్ట్రార్ కార్యాల‌‌యాల‌‌కు రెండు చోట్ల, రంగారెడ్డి జిల్లాలో14కు గాను మూడు చోట్ల, మేడ్చల్ జిల్లాలో 12కు గాను మూడు చోట్ల, సంగారెడ్డి, ప‌‌టాన్‌‌చెరు క‌‌లిపి ఒక‌‌చోట మొత్తం తొమ్మిది ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ స‌‌బ్ రిజిస్ట్రార్ కార్యాలయాల భ‌‌వ‌‌నాల‌‌ను నిర్మించాల‌‌ని నిర్ణయించిన‌‌ట్లు మంత్రి వెల్లడించారు. మొద‌‌ట‌‌గా హైద‌‌రాబాద్‌‌లోని గండిపేట, శేరిలింగంపల్లి, రాజేంద్రన‌‌గ‌‌ర్, బాలాన‌‌గ‌‌ర్ స‌‌బ్ రిజిస్ట్రార్ ఆఫీసులకు భవనాలను గచ్చిబౌలిలోని తెలంగాణ అకాడమీ ఆఫ్ ల్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ మేనేజ్‌‌మెంట్(తాలిమ్) కార్యాలయంలో నిర్మిస్తున్నామన్నారు. ఇంటిగ్రేటెడ్ సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం ఒక రోల్ మోడల్ గా ఉంటుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో చ‌‌ర్చించి ఈ బిల్డింగ్ న‌‌మూనాకు తుది రూపునిస్తామ‌‌ని, వీలైనంత త్వరగా భ‌‌వ‌‌నానికి శంకుస్థాప‌‌న చేసేలా చ‌‌ర్యలు తీసుకుంటామ‌‌న్నారు. 

కేంద్రం సహకరించకున్నా.. ఇందిరమ్మ ఇండ్లు ఆగవు

ఇందిరమ్మ ఇండ్ల స్కీమ్ లో కేంద్రం అనేక నిబంధ‌‌న‌‌ల‌‌తో కొర్రీలు వేస్తోంద‌‌ని మంత్రి పొంగులేటి అన్నారు. శనివారం సెక్రటెరియెట్ లో మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు. ఒక్కో ఇంటికి గ్రామీణ ప్రాంతాల్లో రూ. 72 వేలు, ప‌‌ట్టణ ప్రాంతాల్లో రూ. 1.52 ల‌‌క్షలు కేంద్రం ఇస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 లక్షలు ఇస్తుంద‌‌న్నారు. అరకొర సహాయం చేస్తున్నప్పటికీ, కేంద్రం సహకరించడం లేదన్నారు. అందుకే కేంద్రం సహకరించకపోయినా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని కొనసాగిస్తున్నామని చెప్పారు. కాగా, డిప్యూటీ త‌‌హ‌‌శీల్దార్ డాక్టర్ పైళ్ల న‌‌వీన్‌‌రెడ్డి ర‌‌చించిన తెలంగాణ చ‌‌రిత్ర, ఉద్యమం, క‌‌ళ‌‌లు, సాహిత్యం 5వ ఎడిష‌‌న్‌‌ను పొంగులేటి శనివారం తన చాంబర్ లో ఆవిష్కరించారు.