హైదరాబాద్ సిటీలోని ఈ ప్రాంతాల్లో రేపు(అక్టోబర్ 13), ఎల్లుండి (అక్టోబర్ 14) నీళ్లు బంద్

హైదరాబాద్ సిటీలోని ఈ ప్రాంతాల్లో రేపు(అక్టోబర్ 13), ఎల్లుండి (అక్టోబర్ 14) నీళ్లు బంద్

హైదరాబాద్​సిటీ, వెలుగు: హైదరాబాద్ సిటీకి తాగునీటిని సరఫరా చేసే కృష్ణా ప్రాజెక్ట్ ఫేజ్​-3లోని కోదండాపూర్ నుంచి గొడకొండ్ల పైప్​లైన్​లో భారీ లీకేజీ ఏర్పడింది. ఈ నెల 13 ఉదయం 6 గంటల నుంచి 14న సాయంత్రం 6 గంటల వరకు ఈ వాల్వ్​ల రిపేర్లు కొనసాగనున్నాయి.

ఈ నేపథ్యంలో గచ్చిబౌలి, కొండాపూర్, మాదాపూర్, ప్రశాసన్ నగర్, ఫిల్మ్‌నగర్, జూబ్లీ హిల్స్, తట్టి ఖానా, షేక్​పేట, హకీంపేట్, కర్వాన్, మెహిదీపట్నం, ఆసిఫ్​నగర్, గోల్కొండ, లంగర్ హౌస్,  దుర్గా నగర్, బుద్వేల్, గోల్డెన్ హైట్స్, 9 నంబర్, కిస్మత్‌పూర్, గంధంగూడ, బండ్లగూడ, శాస్త్రిపురం, అల్లబండ, మధుబన్, ధర్మసాయి (శంషాబాద్), సాహేబ్​నగర్, ఆటోనగర్, సరూర్‌ నగర్, నాగోల్, ఎన్‌టీఆర్ నగర్, వనస్థలిపురం, దేవేందర్ నగర్, ఉప్పల్, రాంపల్లి, బోడుప్పల్, చెంగిచెర్ల, మానిక్ చంద్, మల్లికార్జున నగర్, పీర్జాదిగూడ, పెద్ద అంబర్​పేట తదితర ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదని అధికారులు తెలిపారు.