ఏవియేషన్‌ మినిస్ట్రీ వెబ్‌సైట్‌ క్రాష్‌

ఏవియేషన్‌ మినిస్ట్రీ వెబ్‌సైట్‌ క్రాష్‌

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ వల్ల 12 దేశాల్లో చిక్కుకున్న దాదాపు 15 వేల మందిని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం మే 7 నుంచి 13 వరకు 64 ఫ్లైట్స్‌ను నడపనుంది. దీంతో ఏ ఫ్లైట్‌, ఎక్కడి నుంచి ఎన్ని గంటలకు బయల్దేరుతుంది? అనే సమాచారం తెలుసుకునేందుకు ఆయా దేశాల్లో చిక్కుకున్న వారంతా ఏవియేషన్‌ మినిస్ట్రీ వెబ్‌సైట్‌పై పడ్డారు. దీంతో గతంలో ఎప్పుడూ ఇంత ట్రాఫిక్‌ను ఎదుర్కోని ఈ వెబ్‌ సైట్‌.. బుధవారం మధ్యాహ్నం ఒక్క సారిగా క్రాష్‌ అయింది. దానివల్ల కంగారు పడిన ఏవియేషన్‌ మినిస్ట్రీ అధికారులు.. విమానాల ఏర్పాటు, టైమింగ్స్‌ సమాచారాన్ని త్వరలో ఎయిర్‌ ఇండియా వెబ్‌సైట్‌లో ఉంచుతామని, ఎవరూ ఏవియేషన్‌ మినిస్ట్రీ వెబ్‌సైట్‌లో వెతకొద్దని ట్విట్టర్‌లో సూచించారు. ఈ సైట్‌ నుంచే ఎన్‌ఐసీ (నేషనల్‌ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్) నడుస్తుండడంతో ట్రాఫిక్‌ పెరిగిందని అధికారులు చెబుతున్నారు.

Repatriation flights: Aviation ministry website crashesStranded New Zealand nationals arrive to board a repatriation flight back home at the Indira Gandhi International airport in New Delhi, India, Thursday, April 23, 2020. New Zealand has closed the border to everyone except citizens and residents to stop the spread of new coronavirus. (AP Photo/Manish Swarup)