మరోసారి సచిన్ vs షోయాబ్ అక్తర్.. నెలరోజుల్లో దిగ్గజాల సమరం

మరోసారి సచిన్ vs షోయాబ్ అక్తర్.. నెలరోజుల్లో దిగ్గజాల సమరం

ప్రపంచవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల్లో ప్రతి ఏటా లక్షల మంది మరణిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రమాదాలపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు నిర్వహిస్తోన్న రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ మరోసారి అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈసారి దాయాది జ‌ట్టు పాకిస్తాన్ కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. 

గ‌త రెండు ఎడిష‌న్లు భార‌త్‌లో జ‌రగ‌గా.. ఈ టోర్నీలలో పాకిస్తాన్ లెజెండ్స్ జట్టు పాల్గొనలేదు. అయితే ఈ ఏడాది ఇంగ్లండ్ వేదికగా ఈ టోర్నీ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ టోర్నీలో ఆడేందుకు పాకిస్తాన్ దిగ్గజ క్రికెటర్లు అస‌క్తిగా ఉన్న‌ట్లు తెలుస్తోంది. అందుకు పాక్  ప్రభుత్వం కూడా సుముఖంగా ఉన్నట్లు సమాచారం. అదే జరిగితే మాజీ దిగ్గజ క్రికేటర్లైన సచిన్ టెండూల్కర్, షోయాబ్ అక్తర్‌ల మధ్య సమరాన్ని చూసే అవకాశం అభిమానులకు మరోసారి దక్కనుంది. 

సెప్టెంబర్‌లోనే

సెప్టెంబర్ రెండు లేదా మూడో వారంలో ఈ టోర్నీ ప్రారంభంకానున్నట్లు తెలుస్తోంది. నిర్వాహకులు త్వరలోనే ఈ టోర్నీషెడ్యూల్‌ ప్రకటించనున్నారు. ఈ ఎడిషన్‌లో కొత్తగా పాకిస్తాన్ టీమ్‌ కూడా చేరే అవకాశం ఉండడంతో మొత్తం జట్ల సంఖ్య 9కి చేరనుంది. ఈ టోర్నీలో కేవలం రిటైర్డ్‌ క్రికెట్లరు మాత్రమే పాల్గొననున్నారు. కాగా 2021, 2022 రెండు సీజన్లలోనూ సచిన్ సారథ్యంలోని ఇండియా లెజెండ్స్ జట్టు విజేతగా నిలిచింది. 

పాల్గొనబోయే జట్లు(అంచనా):

  • ఇండియా లెజెండ్స్
  • ఇంగ్లాండ్ లెజెండ్స్
  • ఆస్ట్రేలియా లెజెండ్స్
  • వెస్టిండీస్ లెజెండ్స్
  • దక్షిణాఫ్రికా లెజెండ్స్
  • శ్రీలంక లెజెండ్స్
  • బంగ్లాదేశ్ లెజెండ్స్
  • న్యూజిలాండ్ లెజెండ్స్
  • పాకిస్తాన్ లెజెండ్స్