తెలంగాణ రాష్ట్రంలో ఆల్కహాల్‌ జోరు

తెలంగాణ రాష్ట్రంలో ఆల్కహాల్‌ జోరు
  •     ఎక్కువగా లిక్కర్ రెవెన్యూ పొందుతున్న  టాప్ 3  
  •     రాష్ట్రాల్లో  తెలంగాణ
  •     ఐఎస్​డబ్ల్యూఏఐ రిపోర్టు వెల్లడి

హైదరాబాద్​, వెలుగు ; ఆల్కహాల్​ బెవరేజెస్​ వినియోగంలో దేశంలోని టాప్​ రాష్ట్రాలలో తెలంగాణ ఒకటిగా నిలిచినట్లు ఒక రిపోర్టు వెల్లడించింది. ఇండియాలోని ఆల్కహాల్​ బెవరేజెస్​ ఎకనమిక్​ వాల్యూ ఎడిషన్​ 2023 పేరుతో ఈ ఇండస్ట్రీపై మొదటి రిపోర్టును ఇంటర్నేషనల్​ స్పిరిట్స్​ అండ్​ వైన్స్​ అసోసియేషన్​ ఆఫ్​ ఇండియా (ఐఎస్​డబ్ల్యూఏఐ) తీసుకొచ్చింది. రిపోర్టు కాపీని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి, ఎక్సైజ్​ కమీషనర్​ మొహమ్మద్​ ముషారఫ్​ అలీ ఫరూఖీలకు ఐఎస్​డబ్ల్యూఏఐ సీఈఓ నీతా కపూర్​ అందచేశారు. ఆల్కహాల్​ బెవరేజెస్​ ప్రీమియం ప్రొడక్టుల కన్జంప్షన్​లో తెలంగాణ 52 శాతం వాటా దక్కించుకున్నట్లు ఈ రిపోర్టు వెల్లడించింది. 

దేశానికి, వివిధ రాష్ట్రాలకు ఆల్కహాల్​ బెవరేజెస్​ ఇండస్ట్రీ వల్ల కలుగుతున్న ప్రయోజనాలను కూడా ప్రస్తావించింది. ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సవాళ్లను సైతం వివరించింది. ఆల్కహాల్​ బెవరేజస్​ ఇండస్ట్రీపై వ్యాట్​, ఎక్సైజ్​ ద్వారా అత్యధిక ఆదాయం పొందుతున్న మూడు రాష్ట్రాలలో తెలంగాణ ప్లేస్​ సాధించుకున్నట్లు ఐఎస్​డబ్ల్యూఏఐ రిపోర్టు తెలిపింది. ఆల్కహాల్​ బెవరేజెస్​ ఇండస్ట్రీ ఒక ప్రధానమైన ఎకనమిక్​ ఇంజిన్​గా నిలుస్తున్న నేపథ్యంలో ఈ పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లు పరిష్కారమయ్యే దిశలో ప్రభుత్వాలు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందని నీతా కపూర్​ ఈ సందర్భంగా వెల్లడించారు. 

రాష్ట్రంలో ఆల్కహాల్‌ జోరుఆల్కహాల్​ బెవరేజెస్​ వినియోగంతో పాటే వివిధ ధాన్యాలు, మొలాసిస్​, ద్రాక్ష ప్రొడక్షన్​ కూడా పెరుగుతోందని ఐఎస్‌డబ్ల్యూఏఐ​ సెక్రటరీ జనరల్​సురేష్​ మీనన్​ చెప్పారు. ఫలితంగా దేశంలోని రైతులకు ప్రయోజనం కలుగుతోందని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 14 కోట్ల లీటర్ల ఆల్కహాలిక్​  స్పిరిట్​తయారీ సామర్ధ్యం ఉందని, దేశం మొత్తం మీద చూస్తే ఇది 1.5 శాతానికి సమానమని పేర్కొన్నారు.