వ‌ర్క్ ఫ్రం హోం చేస్తున్న రిపోర్ట‌ర్.. స‌డ‌న్ గా వీడియోలోకి ష‌ర్ట్ లేకుండా..

వ‌ర్క్ ఫ్రం హోం చేస్తున్న రిపోర్ట‌ర్.. స‌డ‌న్ గా వీడియోలోకి ష‌ర్ట్ లేకుండా..

వ‌ర్క్ ఫ్రం హోం చేయ‌డం చాలా మందికి ఒక డ్రీమ్ లాంటిదే అని చెప్పాలి. సాఫ్ట్ వేర్ ఫీల్డ్ లో ఇది రోటీన్ విష‌య‌మే కానీ, కొన్ని రంగాల్లో సాధ్యం కాదు. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నియంత్ర‌ణ కోసం ప్ర‌పంచ వ్యాప్తంగా దాదాపు అన్ని ర‌కాల కంపెనీలు త‌మ ఉద్యోగుల‌కు వ‌ర్క్ ఫ్రం హోం ఇచ్చేశాయి. దీంతో మీడియా రంగంలోనూ వ‌ర్క్ ఫ్రం హోం ఇచ్చాయి కొన్ని చాన‌ళ్లు. కానీ ఇంటి ద‌గ్గ‌ర నుంచి వ‌ర్క్ చేయ‌డం అనుకున్నంత సుల‌భ‌మేం కాద‌ని ఇటీవ‌ల కొంత మంది త‌మ అనుభాల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అమెరికాలోని ఓ న్యూస్ చానల్ లో ప‌ని చేసే రిపోర్ట‌ర్ త‌న‌కు ఎదురైన ఓ ష‌న్నీ ప్రాబ్ల‌మ్ ను త‌న ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేసింది.

టీ ష‌ర్ట్ వేసుకుంటూ..

అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన జెసికా లాంగ్ అక్క‌డి స‌న్ కోస్ట్ న్యూస్ నెట్ వ‌ర్క్ లో రిపోర్ట‌ర్ గా పని చేస్తోంది. క‌రోనా వైర‌స్ వ్యాప్తికి సంబంధించిన రిపోర్ట్ ను చానల్ కు పంపేందుకు ఆమె వీడియో రికార్డ్ చేస్తుండ‌గా.. త‌న తండ్రి స‌డ‌న్ గా పూర్తిగా టీ ష‌ర్ట్ వేసుకుండా.. దాన్ని స‌ర్దుకుంటూ వ‌చ్చేశాడు. దీంతో ఆమె ఆ వీడియోను ఆపేయాల్సి వ‌చ్చింది. దానిని ఆమె మార్చి 28న ట్విట్ట‌ర్ లో పోస్ట్ చేసింది. ప్ర‌స్తుతం ఆ వీడియో ట్విట్ట‌ర్ లో వైర‌ల్ అవుతోంది. ఐదు రోజుల్లోనే ఆ వీడియోను 7 ల‌క్ష‌ల 20 వేల మందికి పైగా చూశారు. 12 వేల మంది లైక్ కొట్టారు. 1500 మందికి పైగా షేర్లు చేశారు.