IPL  2024: అడ్డుపడుతున్న బీసీసీఐ.. ఐపీఎల్‌లో పంత్ ఆడేది అనుమానమే! 

IPL  2024: అడ్డుపడుతున్న బీసీసీఐ.. ఐపీఎల్‌లో పంత్ ఆడేది అనుమానమే! 

అదిగో పంత్.. అదిగదిగో రిషబ్ పంత్.. అన్న మాటలు ఇక వినిపించకపోవచ్చు. ఇన్నాళ్లు పంత్ రాకకై వెయ్యి కళ్లతో ఎదురుచూసిన భారత క్రికెట్ అభిమానులకు చేదువార్త అందుతోంది. ఐపీఎల్ 2024లో రిషబ్ పంత్ పునరాగమనం చేస్తాడనే వార్తలకు విరుద్ధంగా నివేదికలు వెలువడ్డాయి. ప్రతి క్షణం ఉత్కంఠభరితంగా సాగే టీ20 పోరుకు పంత్ సరితూగలేడని బీసీసీఐ భావిస్తోందట. ఈ మేరకు ఓ జాతీయ ఛానల్ కథనాన్ని ప్రచురించింది.

ALSO READ :- Pakistan Cricket: సొంత దేశస్థులను నమ్మని పాక్.. కోచ్‌గా మళ్లీ విదేశీయులే

కారు ప్రమాద గాయాల నుంచి పంత్ ఇప్పటికే పూర్తిగా కోలుకున్నాడు. మైదానంలో అడుగుపెట్టి కఠోర సాధన చేస్తున్నాడు.  అయినప్పటికీ, అతని ఫిట్‌నెస్‌పై బీసీసీఐ అధికారులు సందేహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అతనికి ఇంకా బోర్డు నుండి ఫిట్‌నెస్ క్లియరెన్స్ అందలేదని తెలుస్తోంది. అందువల్లే అతను ఢిల్లీ క్యాపిటల్స్ శిక్షణ శిబిరంలో ఇంకా చేరలేదని కథనాలు వస్తున్నాయి. దీంతో ఐపీఎల్‌లో పంత్ ఆడేది అనుమానంగా మారింది. అయితే, దీనిపై ఢిల్లీ క్యాపిటల్స్ ఇంకా స్పందించలేదు.