కోల్‌బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా కేంద్రంలో కురుమ హాస్టల్, కుల సంఘం భవనం కోసం ఎకరం భూమిని కేటాయించాలని కోరుతూ రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామిని కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు గుంట శ్రీశైలం కోరారు.
శుక్రవారం హైదరాబాద్‌లో మంత్రిని సంఘం బాధ్యులతో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లాకు చెందిన కురుమ విద్యార్థులు చదువుకోవడానికి వచ్చి అద్దె ఇండ్లలో కిరాయికి ఉంటూ ఇబ్బందులు పడుతున్నారని, ఎకరం భూమి కేటాయించి విద్యార్థుల కోసం హాస్టల్, కుల సంఘం భవనం నిర్మించేందుకు సహకరించాలని కోరారు. ఇందుకు మంత్రి స్పందిస్తూ భూమి కేటాయింపుకు చర్యలు తీసుకోవాలని ఫోన్లో మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్‌ను ఆదేశించారు. మందమర్రి టౌన్కాంగ్రెస్ ప్రెసిడెంట్తిరుమల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
