జూబ్లీహిల్స్ కో-ఆపరేటివ్ సొసైటీకి.. రెరా రూ.18.51 లక్షల జరిమానా

జూబ్లీహిల్స్ కో-ఆపరేటివ్ సొసైటీకి..  రెరా రూ.18.51 లక్షల జరిమానా

హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా మంచిరేవులలోని ‘జూబ్లీహిల్స్ ఫేజ్ IV’ ప్రాజెక్టును హెచ్ఎండీఏతోపాటు తమ అనుమతులు లేకుండా ప్రచారం చేసినందుకు జూబ్లీహిల్స్ కో-ఆపరేటివ్ సొసైటీకి తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) రూ.18.51 లక్షల జరిమానా విధించింది. సోసైటీ ప్రెసిడెంట్ రవీంద్రనాద్ కు ఈ ఫైన్ వర్తిస్తుందని తీర్పునిచ్చింది. రెరా రిజిస్ట్రేషన్ లేకుండా ప్రకటనలు చేసి ఫ్లాట్లు అమ్మకానికి ప్రయత్నం చేశారని,  ప్రతి దరఖాస్తుదారుని నుంచి రూ.5 లక్షల అడ్వాన్స్ వసూలు చేశారని సోసైటీ సభ్యుడు , అడ్వకేట్ జ్యోతి ప్రసాద్ రెరాకు ఈ ఏడాది జనవరిలో  ఫిర్యాదు చేశారు. 

1,910 యూనిట్లతో 13.7 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో ఫ్లాట్ కొనుగోలుకు తప్పనిసరిగా సభ్యత్వం పొందాలని, ఒక్కో ఫ్లాట్ రూ.2 కోట్లుగా నిర్ణయించి, 1,800 మంది నుంచి రూ.5 లక్షల చొప్పున రూ.90 కోట్లు, అదనంగా రూ.50 కోట్లు వసూలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రెరా నిబంధనలు ఉల్లంఘించినట్లు తేల్చిన చైర్మన్ సత్యనారాయణ, సభ్యులు లక్ష్మినారాయణ, శ్రీనివాసరావు.. రిజిస్ట్రేషన్ పూర్తయ్యే వరకు ప్రచారం, బుకింగ్‌‌‌‌లు నిలిపివేయాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.