వయనాడ్లో రెస్క్యూ కొనసాగుతోంది.. తవ్వినకొద్దీ శవాలే

వయనాడ్లో రెస్క్యూ కొనసాగుతోంది.. తవ్వినకొద్దీ శవాలే

కేరళ వయనాడ్ లో రెస్క్కూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి. భారీ వర్షాలకు మెప్పాడి, చూరల్ మల్ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 350మందికిపైగా మరణించగా.. మరో 2వందల మంది ఆచూకీ తెలియడం లేదు. అడవిలోని ఓ కొండ గుహలో చిక్కుకున్న ఆదివాసీ కుటుంబాన్ని రెస్క్యూ టీంకు చెందిన నలుగురు ఆఫీసర్లు కాపాడారు. ఎనిమిది గంటల పాటు శ్రమించి క్షేమంగా తీసుకొచ్చారు. 

వయనాడ్ ఘటనను జాతీయ విపత్తుగా ప్రకటించే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోందన్నారు... కేంద్ర మంత్రి సురేష్ గోపి. సహాయక చర్యల తీరును ఆయన పర్యవేక్షించారు. మరోవైపు వయనాడ్ బాధితులకు సాయం చేయడానికి.. దేశ వ్యాప్తంగా పలువురు ముందుకొస్తున్నారు. తోచిన సాయం చేసి.. మానవత్వం చాటుకుంటున్నారు. 

మహారాష్ట్రలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. విస్తారగా కురుస్తున్న వర్షాలతో నదులన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.  ఖాడక్వాస్లా డ్యామ్ భారీగా వరద పోటెత్తుంది.  గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. దీంతో ముథా నది ఉధృతంగా ప్రవహిస్తోంది.  ఎక్తా నగర్ లోని ద్వారక బిల్డింగ్ బేస్మెంట్లోకి భారీగా వరద చేరడంతో..అందులో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ALSO READ | జాతీయ విపత్తుగా వయనాడ్ విషాదం! కేంద్ర మంత్రి సురేష్ గోపి చర్చలు

 మరోవైపు పింప్రి- చించ్వాడాలోని మోర్య గోస్వామి గణపతి ఆలయంలోకి పావన నది  వరద చేరింది. దీంతో ఆలయాన్ని మూసేశారు అధికారులు. ముంబైకి నీటి సరఫరా చేసే వైతర్ణ రిజర్వేయర్ గేట్లను ఎత్తి..దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు.

ఏక్తానగర్ వరద బాధితులను ఆదుకోవాలని సీఎం ఏక్ నాథ్ షిండేను కోరామన్నారు MNS చీఫ్ రాజ్ థాక్రే.ముతా నది ఉధృతి, రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టు  చుట్టూ ఉన్న చట్టవిరుద్దమైన కార్యకాలాపా గురించి చర్చించామన్నారు.  వరదల్లో మరణించిన బాధిత ఫ్యామిలీలకు 10లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలన్నారు.

మరోవైపు ముంబైకి ఆరెంజ్ అలర్ట్  ఇచ్చింది ఐఎండీ. రాబోయే 24గంటల్లో సిటీ  భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. సముద్ర తీరం వెంబడి గంటలకు 65కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందన్నారు.