
కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ….సంతాయిపేట శివారులోని భీమేశ్వర వాగులో చిక్కుకున్న 25 మంది రైతులను అధికారులు రక్షించారు. వ్యవసాయ పనుల కోసం రైతులు భీమేశ్వర వాగు దాటి వెళ్లారు . తిరిగి ఇళ్లకు చేరుకునే సమయంలో వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో …అవతలి వైపు రైతులు చిక్కుకున్నారు. ఐతే సమాచారం అందుకున్న రెవిన్యూ పోలీసు అధికారులు రెస్క్యూ టీంను రంగంలోకి దించారు. వరద ప్రవహం తగ్గే వరకు అక్కడే ఉన్న అధికారులు శుక్రవారం ఉదయం రైతులను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు..