చిత్రావతి నదిలో చిక్కుకున్న 10 మంది సురక్షితం

 చిత్రావతి నదిలో చిక్కుకున్న 10 మంది సురక్షితం

వర్ష బీభత్సంతో అనంతపురం జిల్లా చిత్రావతి నదిలో చిక్కుకున్న 10 మందిని సేఫ్ గా కాపాడారు రెస్క్యూ సిబ్బంది. చెన్నేకొత్తపల్లి మండలం వెల్తుర్ది గ్రామం దగ్గర చిత్రావతి నదిలో కారు గల్లంతు అయ్యింది. అందులోని నలుగురు వ్యక్తులను రక్షించేందుకు మరో ఆరుగురు వెళ్లారు. అయితే వీరిని కాపాడేందుకు జేసీబీ వెళ్లింది. వరద ప్రవహానికి జేసీబీ కూడా చిక్కుకుపోయింది. మొత్తం 10 మంది జేసీబీలోనే ఉండిపోయారు. వీరిని రక్షించేందుకు హెలికాప్టర్ తో సహాయక చర్యలు చేపట్టారు. రెండు, మూడు గంటల పాటు రెస్క్యూ చేపట్టి.. 10మందిని సేఫ్ గా ఒడ్డుకు చేర్చారు.