
న్యూఢిల్లీ : ఈ ఏడాది జాబ్ మార్కెట్లో పోటీ బాగా పెరుగుతుందని, పనిచేసే ప్రతి నలుగురు ప్రొఫెషనల్స్‌లో ముగ్గురు జాబ్ మారాలని కోరుకుంటున్నారని ఒక సర్వేలో తేలింది. సర్వేలో 1,016 మంది పాల్గొన్నారు. ఉద్యోగాలలో ఉన్న మూడొంతుల మంది 2021లో కొత్త కొత్త రోల్స్, కొత్త జాబ్స్ కావాలనుకుంటున్నట్లు ఈ సర్వేలో తేలిందని లింక్డ్ ఇన్ జాబ్ సీకర్ రీసెర్చ్ వెల్లడించింది. కెరీర్ గ్రోత్‌కు దేశంలో అవకాశాలు బాగున్నాయనే ఆశాభావం 64 శాతం మంది ప్రొఫెషనల్స్‌లో వ్యక్తమైందని, భవిష్యత్బాగుంటుందనే ధీమా వారిలో కనిపిస్తోందని పేర్కొంది. కెరీర్ భవిష్యత్ కోసం నెట్వర్కింగ్ ఈవెంట్స్అటెండ్ అవ్వాలనే ఆలోచనను 38 శాతం మంది వ్యక్తం చేశారని తెలిపింది. 2021లో కొత్త జాబ్ రావాలంటే ఆన్లైన్లెర్నింగ్లో ఇన్వెస్ట్మెంట్ తప్పనిసరనే అభిప్రాయాన్ని 37 శాతం మంది ప్రకటించారని కూడా లింక్డ్ ఇన్ జాబ్ సీకర్ రీసెర్చ్ సర్వేలో తేలింది.
కరోనా వలన మార్పొచ్చింది…
2021లో జాబ్ మార్కెట్లో పోటీ బాగా పెరగడంతో ప్రొఫెషనల్స్‌లో కొంత వర్రీ మొదలైందని సర్వే పేర్కొంది. రిక్రూట్మెంట్ స్టేజెస్ ఎక్కువగా ఉండటం పట్ల మూడో వంతు మంది కొంత ఆందోళన చెందుతున్నట్లు కూడా తేలింది. అప్లికేషన్ డాక్యుమెంట్స్ దీర్ఘంగా ఉండటం కూడా ఇబ్బందికరంగా ఉందని 75 శాతం మంది అభిప్రాయపడుతున్నట్లు తెలిపింది. నెట్వర్కింగ్ ఉపయోగంపై మూడొంతుల మందిలో పెద్దగా ఆసక్తి కనబడటం లేదని కూడా సర్వే పేర్కొంది. రోజు రోజుకీ మారుతున్న జాబ్ రిక్రూట్మెంట్పై ప్రొఫెషనల్స్‌లో అవగాహన పెంచేందుకు 2021 జాబ్స్ ఆన్ ది రైజ్ ఇండియా లిస్ట్‌ను లింక్డ్ ఇన్ ప్రకటించింది. ఇందులో ప్రొఫెషనల్స్‌కు అవసరమైన కీలకాంశాలను పొందుపరిచారు. దేశంలో వేగంగా పెరుగుతున్న 15 కెరీర్ ఆపర్చునిటీస్ను లిస్ట్‌లో లింక్డ్ ఇన్ ప్రస్తావించింది. ఏప్రిల్‌నుంచి అక్టోబర్2020 మధ్యలో దేశంలో జరిగిన రిక్రూట్మెంట్స్ ఆధారంగా లిస్ట్‌ను రూపొందించినట్లు తెలిపింది. కరోనా మహమ్మారి రాకతో 2020లో జాబ్ మార్కెట్లో చోటు చేసుకున్న మార్పులు, వర్క్ ఎకో సిస్టమ్‌లను జాబ్స్ ఆన్ ది రైజ్ ఇండియా లిస్ట్ ప్రతిఫలిస్తుందని కూడా లింక్డ్ ఇన్ పేర్కొంది. దేశంలోని అన్ని ఇండస్ట్రీస్‌ను డిజిటల్ ట్రాన్స్‌ఫార్మేషనే ముందుకు నడిపిస్తోందని చెబుతూ, టెక్నాలజీ, నాన్–టెక్నాలజీ విభాగాలలోని ఉద్యోగులు రిమోట్‌గా కలిసి పనిచేయడాన్ని 2020 నేర్పించిందని లింక్డ్ ఇన్ టాలెంట్ అండ్ లెర్నింగ్ సొల్యూషన్స్ డైరెక్టర్ రుచీ ఆనంద్చెప్పారు. కంటెంట్ క్రియేటర్స్తోపాటు, ఆడియన్స్‌ను పెంచే వారు బ్రాండ్స్‌కు కీలకమని ఆనంద్ పేర్కొన్నారు.
కంటెంట్ క్రియేటర్స్‌కు అవకాశాలు..
2021లో ఫ్రీలాన్స్ కంటెంట్ క్రియేటర్స్, మార్కెటింగ్, సోషల్ మీడియా, డిజిటల్ మార్కెటింగ్ రోల్స్‌కు ఎక్కువ అవకాశాలు వచ్చే ఛాన్సుందని లింక్డ్ ఇన్ రీసెర్చ్ తేల్చింది. ఇంజినీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్‌లపై రిక్రూటర్ల ఆసక్తి కొనసాగనుందని వెల్లడించింది. డిజిటల్ ఫస్ట్ కాన్సెప్ట్ దూసుకెళ్తున్న నేపథ్యమే దీనికి కారణమని పేర్కొంది. ఈ ఏడాది ఫైనాన్స్, ఎడ్యుకేషన్, హెల్త్‌కేర్, ఈ–కామర్స్ రోల్స్‌కు పాపులారిటీ పెరుగుతుందని, కోవిడ్ –19తో కస్టమర్ సర్వీసెస్ రోల్స్ ఆదరణా ఎక్కువైందని తెలిపింది. ఆన్లైన్లో సర్వీసెస్ డెలివరీ చేసేప్పుడు కస్టమర్లకు ఉండే ఇబ్బందులు తొలగించేందుకు కస్టమర్ సర్వీసెస్ ఉద్యోగులు ముఖ్యమనే అభిప్రాయం కంపెనీలలో ఏర్పడినట్లు పేర్కొంది. జీవితమంతా నేర్చుకుంటూ ఉండాలనే తపనే టాలెంట్‌ను పెంచడంతోపాటు, ముందుండేలా చేస్తుందని కూడా లింక్డ్ ఇన్ రీసెర్చ్ వెల్లడించింది.
టాప్ కెరీర్ ట్రెండ్స్….
కంటెంట్ క్రియేటర్స్
సోషల్ మీడియా డిజిటల్ మార్కెటింగ్
ఫైనాన్స్ ఎడ్యుకేషన్
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్
డేటా సైన్స్ హెల్త్‌కేర్
హ్యూమన్ రిసోర్సెస్ (హెచ్ఆర్)