పార్లమెంట్​ సమావేశాల్లోనే రిజర్వేషన్లు పెంచాలి : డా. ఎల్చల దత్తాత్రేయ

పార్లమెంట్​ సమావేశాల్లోనే రిజర్వేషన్లు పెంచాలి : డా. ఎల్చల దత్తాత్రేయ

ఖైరతాబాద్, వెలుగు: దేశ జనాభాలో సగం ఉన్న బీసీల రిజర్వేషన్లను పార్లమెంట్​సమావేశాల్లోనే పెంచాలని ఓయూ జేఏసీ అధ్యక్షుడు డాక్టర్ ఎల్చల దత్తాత్రేయ డిమాండ్ చేశారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేసిన ప్రధాని మోడీ, బీసీలకు మాత్రం మొండి చేయి చూపాడని విమర్శించారు. బీసీ ప్రధానిని అని చెప్పుకునే మోడీ నిజమైన బీసీనా లేక డూప్లికేట్ బీసీనా తెలియాల్సిన అవసరం ఉందన్నారు. 

ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని కోరారు. లేని పక్షంలో దేశంలోని అన్ని యూనివర్సిటీల్లోని విద్యార్థి, యువజన, కార్మిక, కర్షక, ప్రజాసంఘాలతో కలిసి చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహిస్తామని హెచ్చరించారు. సమావేశంలో విద్యార్థి నాయకులు అశోక్ యాదవ్, రవీందర్ నాయక్, అనిల్ ప్రజాపతి, శ్రావణ్, రవితేజ, సత్యపాల్, వంశీకృష్ణ, నవీన్, శోభన్, తిరుపతి పాల్గొన్నారు.