ఆదిలాబాద్, వెలుగు: మాల సంక్షేమ సంఘం జిల్లా శాఖ క్యాలెండర్ ను గురువారం ఆదిలాబాద్‌లోని సంఘ భవనంలో ఆవిష్కరించారు. జిల్లా అధ్యక్షుడు కొప్పుల రమేశ్ మాట్లాడుతూ.. బడుగు బలహీనవర్గాల అభ్యున్నతికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తన జీవితాన్ని ధారపోశారన్నారు.
ఆయన ఇచ్చిన స్ఫూర్తితో మాలలు అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొబ్బిలి సుధాకర్, గౌరవ అధ్యక్షుడు మేకల మల్లన్న, కోశాధికారి ప్రభాకర్, వ్యవస్థాపక అధ్యక్షుడు బేర దేవన్న పాల్గొన్నారు.
