పారదర్శకంగా సీఎంపీఎఫ్ సేవలు : కమిషనర్ కె.గోవర్ధన్

పారదర్శకంగా సీఎంపీఎఫ్ సేవలు :  కమిషనర్ కె.గోవర్ధన్
  •   కమిషనర్ ​కె.గోవర్ధన్​

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణి ఉద్యోగులకు సీఎంపీఎఫ్ సేవలందించేందుకు ఆలస్యం లేకుండా చర్యలు తీసుకుంటున్నామని సీఎంపీఎఫ్​(కోల్ మైన్స్​ ప్రావిడెంట్​ఫండ్) రీజినల్ కమిషనర్-2  డాక్టర్ ​కె.గోవర్ధన్​ అన్నారు. గురువారం మందమర్రి ఏరియా జీఎం ఆఫీస్​లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. సీఎంపీఎఫ్, పెన్షన్​కు సంబంధించిన లావాదేవీలు సికేర్స్​ పోర్టల్ ​ద్వారా మాత్రమే జరుగుతున్నాయన్నారు. 

సీఎంపీఎఫ్ ​పెన్షన్ ​క్లెయిమ్స్ పూర్తిచేయడానికి కొత్తగా ‘పయాస్’ పద్ధతిని తీసుకొచ్చామని తెలిపారు. కార్మికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని.. దళారులు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా సేవలను పారదర్శకంగా పొందాలని సూచించారు.​ 

ఈ సందర్భంగా 375 రివైజ్డ్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్స్ (ఫార్మర్ అండ్​సర్వైవర్) సెటిల్​మెంట్ కాపీలను సంబంధిత అధికారులకు అందజేశారు. మందమర్రి ఏరియా డీజీఎం(పర్సనల్) సీహెచ్.అశోక్, సీనియర్​పర్సనల్​ఆఫీసర్​రావికంటి సత్యనారాయణ, సీఎంపీఎఫ్​ ఎన్​ఫోర్స్​మెంట్​ ఆఫీసర్ ఎస్.శ్రీనివాస్​రావు, ఎస్​ఎస్​వోలు కె.వరప్రసాద్, ఎ.రాఘవేంద్ర, కె.వెంకటరెడ్డి, వెల్ఫేర్ ​ఆఫీసర్లు పాల్గొన్నారు.