బార్ అండ్ రెస్టారెంట్లో అగ్ని ప్రమాదం..భారీగా ఆస్తి నష్టం

బార్ అండ్ రెస్టారెంట్లో అగ్ని ప్రమాదం..భారీగా ఆస్తి నష్టం

మహబూబాబాద్ జిల్లాలో అగ్ని ప్రమాదం జరిగింది. మరిపెడ మండలం కేంద్రంలోని  హనీ 7 హిల్స్ బార్ &రెస్టారెంట్ లో  మంటలు చెలరేగాయి.  జనవరి 9న ఉదయం తెల్లవారుజామను రెస్టారెంట్లో మంటలు వచ్చాయి.  స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేశారు.

 ప్రమాదంలో రెండు టూ వీలర్ వెహికల్స్ కూడా దగ్ధం అయ్యాయి. రెస్టారెంట్ పూర్తిగా దగ్ధం అయ్యింది. దాదాపు 40 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. విద్యుత్ షార్ట్ సర్జ్యూట్ తో   ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.