మధ్యప్రదేశ్ లోని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇండోర్ సమీపంలో కారు, ట్రక్కు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మధ్యప్రదేశ్ మాజీ హోంమంత్రి కుమార్తె అక్కడికక్కడే చనిపోయింది.. ఆమెతోపాటు కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే..
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ సమీపంలోని రాలామండల్ వేగంగా వచ్చిన ట్రక్కు కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మధ్యప్రదేశ్ మాజీ హోంమంత్రి బాలా బచ్చన్ కుమార్తె ప్రేరణతో సహా ముగ్గురు మృతిచెందారు. కారులో ఉన్న మరో యువతి తీవ్రగాయాలయ్యాయి.
విషయం తెలుసుకున్న స్థానికులు, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని చికిత్సకోసం గాయపడిన యువతిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన తర్వాత ట్రక్కు డ్రైవర్ అక్కడినుంచి పారిపోయారు. శుక్రవారం (జనవరి 9) తెల్లవారు జామున 5గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
