మల్లన్నసాగర్ నిర్వాసితుడు ఆత్మహత్య..

మల్లన్నసాగర్ నిర్వాసితుడు ఆత్మహత్య..

సిద్దిపేటజిల్లా వేములఘాట్ లో సూసైడ్ చేసుకున్న  మల్లన్న సాగర్ ముంపు బాధితుడు మల్లారెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావును తుక్కాపూర్ వద్ద అరెస్ట్ చేశారు.

మల్లన్నసాగర్ ముంపు గ్రామంలో ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ రాకపోవడంతో నిర్వాసితుడు సూసైడ్ చేసుకున్నాడు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం వేములఘాట్ కు చెందిన మల్లారెడ్డికి పునరావాస కాలనీలో ఇళ్లు రాలేదు. ఉన్న ఇళ్లు అధికారుల కూల్చేశారు. దీంతో మనస్థాపం చెంది మల్లారెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు చెప్పారు. కూల్చివేసిన ఇంట్లోనే కిరోసిన్ పోసుకొని సూసైడ్ చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు.