పల్లెతో తెగిన పేగు బంధం

V6 Velugu Posted on Apr 08, 2021

  • కన్నీటి మధ్య వేములఘాట్‌ను ఖాళీ చేసిన మల్లన్నసాగర్ నిర్వాసితులు

సిద్దిపేట, వెలుగు: కట్టుకున్న ఇల్లు.. పెట్టుకున్న గోడ.. నీడనిచ్చిన చెట్టు.. నడిసొచ్చిన బాట.. తరతరాలుగా అల్లుకున్న బంధాలు.. వీటన్నింటినీ యాదికి తెచ్చుకొని కన్నీళ్ల మధ్య వేములఘాట్ ప్రజలు ఊరును విడిసిన్రు. ‘‘ఓ అవ్వా.. ఓ బాపూ.. ఓ అన్నా.. ఓ అక్కా.. మన ఊరు ఆగమైందే.   మునిగిపోతున్నదే..” అంటూ గొడ గొడ ఏడ్చిన్రు.  సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని వేములఘాట్ గ్రామం మల్లన్న సాగర్ రిజర్వాయర్లో ముంపునకు గురవుతున్నది. పరిహారాల చెల్లింపులు తుది దశకు చేరడంతో ఊరిని ఆఫీసర్లు ఖాళీ చేయిస్తున్నరు. బుధవారం వేములఘాట్ నుంచి  50 కుటుంబాలు ప్రత్యేక వాహనాల్లో గజ్వేల్ సమీపంలోని సంగాపూర్కు తరలినయ్. ఊరితో తమ అనుబంధాన్ని యాదికితెచ్చుకుంటూ జనం గుండెలు బాదుకున్నరు. బతికినన్నాళ్లు  కష్టసుఖాల్లో పాలుపంచుకున్నోళ్లు చెట్టుకొకరు, పుట్టకొకరుగా వెళ్లిపోతుంటే వేములఘాట్ మౌనసాక్షిగా మిగిలిపోయింది. 
 

Tagged Telangana, siddipet, Mallanna sagar project

More News