ఆర్మూర్ మెప్మా రిసోర్స్ పర్సన్ రాజీనామా

ఆర్మూర్ మెప్మా రిసోర్స్ పర్సన్ రాజీనామా
  •     ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి తిట్టినందుకేనని ఆరోపణ 

ఆర్మూర్, వెలుగు : లోక్​ సభ ఎన్నికల పోలింగ్ కేంద్రంలోకి వచ్చిన ఎమ్మెల్యే పైడి రాకేశ్​ రెడ్డి గెట్ అవుట్ అని అన్నందుకే రాజీనామా చేస్తున్నట్లు మెప్మా రిసోర్స్ పర్సన్ దోండి గంగామణి బుధవారం మున్సిపల్ కమిషనర్ రాజుకు ఫిర్యాదు చేశారు.  మొన్నటి లోక్ సభ ఎన్నికల్లో మెప్మా ఆర్పీలకు వాలంటీర్లుగా కమిషనర్ డ్యూటీలు వేశారని తెలిపారు.

ఇందులో భాగంగా 54వ పోలింగ్ బూత్ లో డ్యూటీ చేస్తుండగా ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుతూ.. ఇక్కడి నుంచి బయటికి వెళ్లని బెదిరించాడని వాపోయారు.  భర్తలు రాజకీయాల్లో ఉంటే వారి భార్యలు జాబులు చేయకూడదా అని ఆమె ప్రశ్నించారు.