గాంధీకి అమెరికా ప్రతిష్టాత్మక కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్

V6 Velugu Posted on Aug 14, 2021

జాతిపిత మహాత్మా గాంధీని ప్రతిష్టాత్మక కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్ అవార్డుతో గౌరవించుకోవాలని అమెరికా ప్రతినిధులు సభ తీర్మానించింది. న్యూయార్క్ ప్రజాప్రతినిధి కరోలిన్ బీ మెలోని ఈ ప్రతిపాదనను సభ ముందు ఉంచగా సభ్యులు ఆమోదం తెలిపారు. శాంతి, అహింస మార్గాల్లో మానవాళికి ప్రేరణగా నిలిచిన గాంధీకి ఈ పురస్కారాన్ని ఇవ్వాలని చట్టసభ్యురాలు కరోలిన్ బీ మెలోని కోరారు.

మహాత్మా గాంధీ చేపట్టిన సత్యాగ్రహ ఉద్యమం, ఆయన నడిచిన అహింస మార్గాలు దేశానికి, ప్రపంచానికి ఎంతో స్ఫూర్తినిచ్చాయకమన్నారు కరోలిన్ బీ మెలోని. ఇతరులకు సేవ చేయడం కోసం సర్వస్వాన్ని ఇచ్చేయడం అనే దానికి ఆయనో ఉదాహరణ అని చెప్పారు. గాంధీ మార్గం.. మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్, నెల్సన్ మండేలా చేపట్టిన వర్ణవివక్ష వ్యతిరేక ఉద్యమాలకు స్ఫూర్తినిచ్చాయని తెలిపారు.

కాంగ్రెషనల్ గోల్డ్ మెడల్ అనేది యునైటెడ్ స్టేట్స్‌లో అత్యున్నత పౌర పురస్కారం. మరణానంతరం ఈ పురస్కారం పొందనున్న మొదటి వ్యక్తి గాంధీ కానున్నారు.

Tagged US Congress award, Mahatma Gandhi , Congressional Gold Medal 

Latest Videos

Subscribe Now

More News