- జయేశ్ రంజన్‌కు చాడ వెంకట్ రెడ్డి వినతి
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని టూరిజం కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని సీపీఐ నేత చాడ వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సెక్రటేరియెట్‌లో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్‌ను చాడ వెంకట్‌రెడ్డితో పాటు టూరిజం కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సబ్బు రాజమౌళి, ప్రజా నాట్యమండలి ప్రధాన కార్యదర్శి నరసింహ కలిసి వినతి పత్రం అందించారు.
ఈ సందర్భంగా చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ... టూరిజం డిపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు.
