హైదరాబాద్‌లో భారీ వర్షానికి రెస్టారెంట్‌లోకి వరద

హైదరాబాద్‌లో భారీ వర్షానికి రెస్టారెంట్‌లోకి వరద

హైదరాబాద్‌ను మరోసారి వరద ముంచెత్తించింది. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాలకు సిటీలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి.  రాత్రి ఏడు గంటల నుంచి కేవలం మూడు నాలుగు గంటల్లోనే పాత బస్తీలో 10 నుంచి 12 సెంటీమీటర్ల వరకూ వర్షపాతం కురిసింది. సరూర్‌‌నగర్‌‌లోని లింగోజీగూడలోనే 13 సెంటీమీటర్ల వర్షం కురిసింది.  లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు ఈ వరద కారణంగా తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఇండ్లలోకి నీళ్లు వచ్చి జనం నానా కష్టాలు పడ్డారు.

పాతబస్తీలో అనేక ప్రాంతాల్లో కొన్ని గంటల పాటు వరద అల్లకల్లోలం సృష్టించింది. పాతబస్తీలోని ఓ రెస్టారెంట్‌లో జనాలు ఉండగా నిమిషాల్లోనే నీళ్లు రావడంతో ఇబ్బందులుపడ్డారు. నీళ్లలోనే జనాలు తిరుగుతూ కనిపించారు. అలాగే మరికొన్ని ప్రాంతాల్లో ప్రహరీ గోడ ఎత్తులో నీళ్లు ప్రవహించాయి. రోడ్లపై ఉధృతంగా వాగు పారుతోందా అన్నట్టుగా కనిపించింది. ఈ వరదలో ఒక ఆటో కొట్టుకుపోయింది.

మరిన్ని వార్తల కోసం..

ప్రకాశ్ రాజ్‌కేనా.. మోహన్‌ బాబుకు గొడవల్లేవా: నాగబాబు

కేంద్ర మంత్రి కొడుకును అరెస్ట్ చేయాలంటూ సిద్ధూ నిరాహార దీక్ష

వరుసగా ఐదో రోజు: పెట్రోల్‎తో పాటు డీజిల్ ధరలు పైపైకి