గోధుమలు, బియ్యం, చక్కెర ఎగుమతులపై ..కొనసాగనున్న రిస్ట్రిక్షన్లు

గోధుమలు, బియ్యం, చక్కెర ఎగుమతులపై ..కొనసాగనున్న రిస్ట్రిక్షన్లు

 న్యూఢిల్లీ :  గోధుమలు, బియ్యం, చక్కెర  ఎగుమతులపై పెట్టిన రిస్ట్రిక్షన్లను ఇప్పటిలో ఎత్తేయబోమని  కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ పేర్కొన్నారు.  ‘ఎటువంటి ప్లాన్‌‌ లేదు. అవసరం లేదు’ అని అన్నారు.  గోధుమలు, చక్కెరను దిగుమతి చేసుకోమని కూడా వెల్లడించారు.  గోధుమల ఎగుమతులను 2022  మేలో ప్రభుత్వం బ్యాన్ చేసింది.  నాన్‌‌ బాస్మతి రైస్‌‌ ఎగుమతులపై  కిందటేడాది జులై నుంచి, చక్కెర ఎగుమతులపై అక్టోబర్‌‌‌‌ నుంచి  బ్యాన్‌‌ పెట్టింది. 

లోకల్‌‌గా పెరుగుతున్న ధరలను కంట్రోల్ చేసేందుకు ఈ చర్యలు తీసుకుంది.  ఫ్రెండ్లీ దేశాలకు సాయంగా రైస్ ఎగుమతి చేస్తున్నామని పీయూష్ గోయెల్ పేర్కొన్నారు. ఇండోనేషియా,  సెనెగల్‌‌, గాంబియా వంటి దేశాలకు రైస్‌‌ అందించామని చెప్పారు.