3 నెలల కనిష్టానికి రిటైల్ ఇన్‌‌‌‌ఫ్లేషన్

3 నెలల కనిష్టానికి రిటైల్ ఇన్‌‌‌‌ఫ్లేషన్

న్యూఢిల్లీ: దేశ రిటైల్ ఇన్‌‌‌‌ఫ్లేషన్ (ధరల పెరుగుదల) ఈ ఏడాది అక్టోబర్‌‌‌‌ నెలలో ఏడాది ప్రాతిపదికన  6.77 శాతానికి దిగొచ్చింది. సెప్టెంబర్‌‌‌‌లో  రిటైల్ ఇన్‌‌ఫ్లేషన్ 7.41 శాతంగా నమోదయ్యింది. కిందటి నెలలో ఇన్‌‌ఫ్లేషన్ తగ్గినప్పటికీ ఆర్‌‌‌‌బీఐ పెట్టుకున్న లిమిట్‌‌  6 శాతం కంటే పైన వరసగా 10 వ నెలలోనూ రికార్డయ్యింది. సీక్వెన్షియల్‌‌గా చూస్తే సెప్టెంబర్‌‌‌‌తో పోలిస్తే అక్టోబర్‌‌‌‌లో రిటైల్‌‌ ఇన్‌‌ఫ్లేషన్ 0.80 శాతానికి చేరుకుంది . గత 12 నెలల్లో ఇన్‌‌ఫ్లేషన్ హై లెవెల్‌‌లో ఉండడంతోనే అక్టోబర్‌‌‌‌లో ఎక్కువగా తగ్గినట్టు అనిపిస్తోందని ఎనలిస్టులు పేర్కొన్నారు.

జియోపొలిటికల్ టెన్షన్ల వలన సప్లయ్ చెయిన్ సమస్యలు ఇంకా కొనసాగుతున్నాయని,  కమొడిటీల ధరలు గరిష్టాల్లోనే ఉన్నాయని వివరించారు. కిందటి నెలలో ఆహారపదార్ధాల ధరలను కొలిచే ఫుడ్ ఇన్‌‌ఫ్లేషన్ 7.01 శాతానికి తగ్గింది. అంతకుముందు నెలలో ఈ సెగ్మెంట్‌‌లో ఇన్‌‌ఫ్లేషన్ 8.6 శాతంగా రికార్డయ్యింది. వెజిటబుల్స్‌‌కి సంబంధించిన ఇన్‌‌ఫ్లేషన్ 7.7 శాతంగా నమోదయ్యింది.  ఫ్యూయల్‌‌కు సంబంధించిన ఇన్‌‌ఫ్లేషన్ సెప్టెంబర్‌‌‌‌లో 10.39 శాతంగా ఉండగా, అక్టోబర్‌‌‌‌లో  9.9 శాతానికి తగ్గింది.  

వడ్డీ రేట్లు, ఇన్‌‌ఫ్లేషన్..రెండూ ఎక్కువగా ఉండడంతో దేశ జీడీపీ గ్రోత్‌‌ రేటును మూడీస్ లాంటి సంస్థలు  తగ్గించేస్తున్నాయని ఎనలిస్టులు పేర్కొన్నారు. ఇన్‌‌ఫ్లేషన్‌‌ను 6 శాతానికి లోపు కంట్రోల్ చేయలేకపోవడానికి గల కారణాలను వివరిస్తూ ఈ నెల 3 న   ప్రభుత్వానికి ఆర్‌‌‌‌బీఐ లెటర్ పంపింది.  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో క్వార్టర్‌‌‌‌లో రిటైల్ ఇన్‌‌ఫ్లేషన్ 6.5 శాతంగా, నాలుగో క్వార్టర్‌‌‌‌లో 5.8 శాతంగా  ఉంటుందని ఈ సెంట్రల్ బ్యాంక్‌ అంచనావేసింది.

8.39 శాతానికి హోల్‌‌సేల్ ఇన్‌‌ఫ్లేషన్...

హోల్‌‌సేల్ ధరలను కొలిచే హోల్‌‌సేల్ ఇన్‌‌ఫ్లేషన్ అక్టోబర్ నెలలో 8.39 శాతానికి దిగొచ్చింది. వరసగా  18 నెలల పాటు రెండంకెల్లోనే నమోదయిన ఈ ఇన్‌‌ఫ్లేషన్‌‌, తాజాగా సింగిల్ డిజిట్‌‌కు  తగ్గింది. ఈ ఏడాది సెప్టెంబర్‌‌‌‌లో హోల్‌‌సేల్ ఇన్‌‌ఫ్లేషన్ 10 శాతంగా, కిందటేడాది అక్టోబర్‌‌‌‌లో 13.83 శాతంగా నమోదయ్యింది. ఆయిల్‌‌, బేసిక్ మెటల్స్‌‌,  ఇతర రకాల మెటల్‌‌ ప్రొడక్ట్‌‌ల రేట్లు తగ్గడంతో హోల్‌‌సేల్ ఇన్‌‌ఫ్లేషన్ దిగొచ్చిందని కామర్స్‌‌ మినిస్ట్రీ ఓ స్టేట్‌‌మెంట్‌‌లో పేర్కొంది. వెజిటబుల్స్ ధరల (హోల్‌‌సేల్ లెవెల్‌‌లో) ను కొలిచే వెజిటబుల్స్‌‌ ఇన్‌‌ఫ్లేషన్ అక్టోబర్‌‌‌‌లో 17.61 శాతానికి తగ్గింది. సెప్టెంబర్‌‌‌‌లో ఇది 39.66 శాతంగా రికార్డయ్యింది. మాన్యుఫాక్చరింగ్ సెక్టార్‌‌‌‌లో హోల్‌‌సేల్ ఇన్‌‌ఫ్లేషన్  సెప్టెంబర్‌‌‌‌లో 6.3 శాతం ఉండగా, అక్టోబర్‌‌‌‌లో 4.42 శాతంగా రికార్డయ్యింది. ఫ్యూయల్‌‌, పవర్ సెక్టార్‌‌‌‌ను కొలిచే ఇన్‌‌ఫ్లేషన్ నెల ప్రాతిపదికన 32.61 శాతం నుంచి 23.17 శాతానికి దిగొచ్చింది.