
- లైఫ్ సర్టిఫికెట్ప్రాసెస్ చేస్తామని చెప్పి రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయ్‌కి సైబర్ క్రిమినల్స్ టోకరా
- ఫేస్బుక్లో లింక్ క్లిక్ చేసిన బాధితుడు
- వివరాలు ఎంటర్ చేయగా ఎర్రర్ మెసేజ్
- వాట్సాప్ మెసేజ్‌కు వచ్చి ఫైల్ ఇన్‌స్టాల్ చేయగానే అకౌంట్ నుంచి డబ్బులు మాయం
- హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు
బషీర్‌బాగ్, వెలుగు: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా రిటైర్డ్ ఎంప్లాయీస్‌ను టార్గెట్ చేస్తూ లక్షలకు లక్షలు కొట్టేస్తున్నారు. తాజాగా.. హైదరాబాద్‌లో ఓ రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగిని సైబర్ క్రిమినల్స్ బోల్తా కొట్టించారు. ఫేస్బుక్లో లైఫ్ సర్టిఫికెట్ పేరుతో వల వేశారు. వాట్సాప్‌లో సంప్రదించి..ఆయనకు ఏపీకే ఫైల్ పంపించి.. లింక్ క్లిక్ చేయగానే ఏకంగా రూ.13 లక్షలు కొట్టేశారు. దీంతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. బర్కత్‌పురాకు చెందిన ఓ రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి (82)కి లైఫ్ సర్టిఫికెట్అవసరం ఏర్పడింది. నవంబర్30వ తేదీలోగా సర్టిఫికెట్సబ్మిట్ చేయాల్సి ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ఉద్యోగులు పదవీ విరమణ తర్వాత పింఛన్ రావాలంటే ప్రతి ఏడాది లైఫ్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. లేకపోతే పెన్షన్ఆగిపోతుంది. 80 ఏండ్లలోపు వారు నవంబర్1 నుంచి 30వ తేదీ వరకు, 80 ఏండ్ల పైబడిన వారు అక్టోబర్నుంచే సెంట్రల్ పెన్షన్ ప్రాసెసింగ్ సెంటర్స్‌కు సబ్మిట్ చేసే వెసులుబాటు కల్పించారు.
ఈ నెల 4న బాధితుడు ఫేస్బుక్చూస్తుండగా.. ఒకచోట పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఖాతాదారులు లైఫ్ సర్టిఫికెట్ కావాలంటే అక్కడ ఇచ్చిన లింక్‌ను క్లిక్ చేయాలని మెన్షన్ చేసి ఉంది. దీంతో బాధితుడు ఆ లింక్‌ను క్లిక్ చేశాడు. తర్వాత బాధితుడి పేరు, బ్యాంక్అకౌంట్నంబర్, ఆధార్, ఏ బ్రాంచీలో అకౌంట్ఉంది? తదితర వివరాలను ఎంటర్‌చేయాలని వచ్చింది. వారు కోరినట్టుగానే అతడు డిటెయిల్స్ నమోదు చేయగా, ఎర్రర్ వచ్చింది. కొద్ది నిమిషాలకే వాట్సాప్‌లో పంజాబ్ నేషనల్ బ్యాంకు డీపీ పెట్టుకున్న ఒక అకౌంట్నుంచి బాధితుడికి వాట్సాప్ మెసేజ్వచ్చింది.
అందులో ‘‘ఈ మెసేజ్పంజాబ్ నేషనల్‌బ్యాంకు నుంచి.. మీరు లైఫ్ సర్టిఫికెట్ కోసం ఫేస్బుక్లో పెట్టుకున్న రిక్వెస్ట్ మాకు అందింది.. టెక్నికల్రీజన్స్వల్ల ప్రాసెస్మధ్యలో ఆగిపోయింది. దయచేసి మీకు మేం పంపిన ఫైల్(ఏపీకే)ను క్లిక్‌చేసి ఇన్‌స్టాల్ చేసుకుని ప్రాసెస్ పూర్తి చేయండి’’ అని ఉంది. దీంతో వారు చెప్పినట్టే ఆయన ఏపీకే ఫైల్ క్లిక్ చేసి.. ఇన్‌స్టాల్ చేశాడు. కాసేపటికి అతని పీఎన్‌బీ సేవింగ్స్ అకౌంట్ నుంచి రూ.12.99 లక్షలు డెబిట్ అయినట్లు మెసేజ్ రావడంతో షాక్ కు గురయ్యాడు. తాను మోసపోయానని గ్రహించి.. హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హైదరాబాద్ సైబర్ క్రైమ్ ఏసీపీ శివమారుతి తెలిపారు.
ఇలా చేయండి..
వాట్సాప్‌లో సైబర్క్రిమినల్స్ఏపీకే ఫై పంపించి లక్షలు కొట్టేస్తున్నారు. ఆర్టీవో చలాన్, ఎస్బీఐ రివార్డ్స్, పీఎం కిసాన్, పంజాబ్ నేషనల్ బ్యాంక్లైఫ్సర్టిఫికెట్ పేరుతో వస్తున్న ఏపీకే ఫైల్స్అస్సలే క్లిక్ చేయొద్దు. సైబర్ క్రిమినల్స్ఎక్కువగా ఏపీకే ఫైల్స్‌ను టెలిగ్రామ్, వాట్సాప్ ద్వారా సెల్‌ఫోన్లకు మెసేజ్చేస్తారు. ఆ లింక్‌ను క్లిక్ చేసి ఇన్స్టాల్చేస్తే మన ఫోన్హ్యాక్అయి.. మన సమాచారమంతా వారికి వెళ్లిపోతుంది.
పర్సనల్డేటా, బ్యాంకు లాగిన్ఐడీలు, పాస్‌వర్డుల ద్వారా మన అంగీకారం లేకుండానే వేరే అకౌంట్లకు డబ్బులను ట్రాన్స్ఫర్చేసుకుంటారు. ఇలా కాకూడదు అనుకుంటే ఫోన్‌లోని సెట్టింగ్స్‌లో ఇన్‌స్టాల్ ఫ్రం అన్‌నోన్ సోర్సెస్ అనే ఆప్షన్‌ను డిజేబుల్ చేసుకోవాలి. మొబైల్ సెట్టింగ్స్‌లో ఫోన్ నంబర్లను యాక్సెస్ చేసే అనుమతి ఇవ్వొద్దు. తెలియని ఏపీకే ఫైల్, మాల్‌వేర్ ఇన్‌స్టాల్ జరిగినట్టు తెలిస్తే ఫోన్‌ను రీసెట్ చేసుకోవాలి.