
కరీంనగర్ జిల్లాకి చెందిన రిటైర్డ్ సీఐ దాసరి భూమయ్య తన అనుచరులతో కలిసి పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో గాంధీ భవన్ లో కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన భూమయ్య.. 27 ఏండ్లుగా పోలీస్ శాఖలో పని చేశాననీ…. ఆ శాఖలో చాలా అణచివేతను చూశానని అన్నారు. ప్రజా సేవ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ లో చేరుతున్నానని చెప్పారు. “టీఆర్ఎస్ పాలన రాజరికాన్ని తలపిస్తోంది. కుటుంబ పాలన చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సైనికుడు లాగా పని చేస్తా” అని చెప్పారు భూమయ్య.
తాను విద్యార్థి సంఘం నాయకుడిగా ఉన్నప్పుటి నుండి భూమయ్యతో పరిచయం ఉందని పీసీసీ ఉపాధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ చెప్పారు.