
- ఇలాంటివి చూస్తే ప్రజలకు
- ప్రభుత్వంపై నమ్మకం కలుగుతుంది : ఆకునూరి
హైదరాబాద్, వెలుగు : ఎన్ కన్వెన్షన్ ను హైడ్రా కూల్చివేయడంపై రిటైర్డ్ ఐఏఎస్ అకునూరి మురళి స్పందించారు. ‘ఇది సుపరిపాలన అంటే. ఇలాంటివి చూసినపుడే ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం ఏర్పడుతుంది’ అని ఆయన శనివారం ట్వీట్ చేశారు.
పెద్ద/చిన్న రాజకీయ పార్టీలకు అతీతంగా (అధికార పార్టీతో సహా) ఇల్లీగల్ గా కట్టినవన్నింటిని కూల్చేయాలని ఆయన సూచించారు. ఈ అక్రమ కట్టడాలకు పర్మిషన్లు ఇచ్చిన అధికారులను కూడా విచారించాలని ఆయన కోరారు. సీఎంవో తెలంగాణ ట్విట్టర్ అకౌంట్ ను తన ట్వీట్ కు ట్యాగ్ చేశారు.