ఈ మూడు పార్టీలు దేశాన్ని నాశనం చేస్తున్నాయి : ఆకునూరి మురళి

ఈ మూడు పార్టీలు దేశాన్ని నాశనం చేస్తున్నాయి : ఆకునూరి మురళి

హనుమకొండ : బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం ఒకే విధంగా పని చేస్తున్నాయని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి అన్నారు. ఈ మూడు పార్టీలు దేశాన్ని సర్వ నాశనం చేస్తున్నాయని ఆరోపించారు. తొమ్మిదేండ్లలో బీఆర్ఎస్ ఆర్థిక దోపిడీ వల్ల రాష్ట్రం ముందుకు పోవడం లేదన్నారు.కులాలు, మతాల వారీగా  బీజేపీ విద్వేష రాజకీయాలు చేస్తోందన్నారు. వరంగల్ ప్రెస్ క్లబ్ లో  జాగో తెలంగాణ సమావేశం నిర్వహించారు. అవినీతి అబద్దాల (BRS ), విభజన విద్వేష ( BJP ) రాజకీయాలను ఓడిద్దాం పేరుతో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జస్టిస్ చంద్రకుమార్, ఆకునూరి మురళి, ప్రొ. పద్మజ షా, ప్రొ. వినాయక్ రెడ్డి, ప్రొ. వెంకట నారాయణ, డా. పృథ్వీరాజ్, ప్రొ.లక్ష్మీనారాయణ, డా. యాదగిరి చార్యులు పాల్గొన్నారు.

దేశ సంపదను బీజేపీ కార్పొరేట్ లకు దోచి పెడుతోందని ఆరోపించారు. ప్రభుత్వ వ్యవస్థ లంచగొండిగా మారిందన్నారు. చంద్రబాబు నుంచి ఇప్పటివరకు చాలామంది పాలన చూశానని, కేసీఆర్ లాంటి అవినీతి, మోసపూరిత పరిపాలన ఎక్కడా చూడలేదన్నారు. రాష్ట్రంలో బీజేపీ ఓడిపోవాలి.. బీఆర్ఎస్ దిగిపోవాలని పిలుపునిచ్చారు.  తాము  కాంగ్రెస్ కు పక్షపాతులం కాదన్నారు. రాష్ట్రంలో ఆరు, ఏడు వరకు రాజకీయ పార్టీలు ఉన్నాయని, వాటిలో ఏ పార్టీకైనా ఓటు వేయండి అంటూ పిలుపునిచ్చారు. కేసీఆర్ కేవలం ఒక్క శాతమే న్యాయం చేసి.. 99 శాతం మోసం చేస్తాడన్నారు. ఎప్పుడు, ఎవర్ని, ఎలా తొక్కేయాలనే ఆలోచన చేస్తాడని ఆరోపించారు.బీజేపీ నాయకులు జై శ్రీరామ్ అంటారని, దాని వెనుక దాగి ఉన్న మోసాన్ని పసిగట్టాలని పిలుపునిచ్చారు.