పేరుకు ధనిక రాష్ట్రం.. బడులు అధ్వానం

పేరుకు ధనిక రాష్ట్రం.. బడులు అధ్వానం

కామారెడ్డి, వెలుగు: పేరుకు తెలంగాణ ధనిక రాష్ట్రమని.. బడులు మాత్రం అధ్వానంగా ఉన్నాయని రిటైర్డ్​ ఐఏఎస్​ ఆకునూరి మురళి అన్నారు. రూ. 2 లక్షల కోట్ల స్టేట్​బడ్జెట్​లో విద్యకు కేటాయించేది  కేవలం 5.8 శాతమేనని, ఇదీ ఖర్చు చేయడం లేదన్నారు.  స్కూల్స్​లో మౌలిక వసతుల లేవని, టీచర్లు లేరన్నారు.  40 లక్షల మంది స్టూడెంట్స్​పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందన్నారు. సోషల్​డెమోక్రటిక్​ఫోరం ఆధ్వర్యంలో  రెండు రోజుల పాటు కామారెడ్డి జిల్లాలో గవర్నమెంట్​స్కూల్స్​ను మురళి, ప్రొఫెసర్​లక్ష్మీనారాయణ తదితరులు పరిశీలించారు. ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రం దళితవాడలోని హైస్కూల్​ను పరిశీలించారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ తాము పరిశీలించిన చోట్ల స్కూల్స్​లో క్లాస్​రూమ్స్​సరిగ్గా లేవన్నారు. రూమ్స్​ఎప్పుడు పడిపోతాయో తెలియని పరిస్థితి ఉందని   కూర్చునేందుకు బల్లలు కూడా సరిపడా లేవన్నారు. బ్లాక్​బోర్డులు పాడయ్యాయని, వాటిపై రాస్తే స్టూడెంట్స్​కు అర్థమయ్యే పరిస్థితి లేదన్నారు. తాగు నీటి వసతి కూడా సరిగ్గా లేదన్నారు.  మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయని, శుభ్రం చేసేందుకు శానిటేషన్​కార్మికులు కూడా లేరన్నారు. రాష్ట్రంలోని అన్ని గవర్నమెంట్​స్కూల్స్​ పరిస్థితి ఇలానే ఉందన్నారు. స్టేట్​ గవర్నమెంట్​స్కూల్స్​పై అస్సలు ఫోకస్​ చేయడం లేదన్నారు. ఢిల్లీ, ఏపీ, తమిళనాడు, కేరళ స్టేట్స్​స్కూల్స్​పై పెట్టుబడి పెట్టి పిల్లలు చదువుకునేందుకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పిస్తున్నాయని అన్నారు.

ప్రజలు ప్రశ్నించాలె

స్కూల్స్​పరిస్థితులపై ప్రజలు గవర్నమెంట్​ను ప్రశ్నించాలి.  డిమాండ్​ చేయకపోతే  గవర్నమెంట్​మొద్దు నిద్ర పోతుందన్నారు. బంగారు తెలంగాణలో  స్కూల్స్​తోపాటు రోడ్లు, హాస్పిటల్స్​పరిస్థితి కూడా అధ్వానంగా ఉందన్నారు.