ఫోన్ టాపింగ్ కేసులో కీలక మలుపు : జూబ్లీహిల్స్ ACPకి రిటైర్డ్ ఐజి ప్రభాకర్ లేఖ

ఫోన్ టాపింగ్ కేసులో కీలక మలుపు : జూబ్లీహిల్స్ ACPకి రిటైర్డ్ ఐజి ప్రభాకర్ లేఖ

హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఏసిపికి రిటైర్డ్ ఐజి ప్రభాకర్ రావు జూన్ 23న అమెరికా నుంచి లేఖ రాశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రభాకర్ రావు ఆ లేఖలో పేర్కొన్నారు. క్యాన్సర్ వ్యాధితో పాటు తీవ్ర రక్తపోటుతో ఆయన బాధపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఆంకాలజీ, కార్డియాలజీ, యూరాలజీ డాక్టర్లతో ట్రీట్ మెంట్ తీసుకొంటున్నట్లు ఆయన లేఖలో పేర్కొన్నారు. 

ముందుగా అనుకున్నట్లు జూన్ 26న ఇండియాకు రావాల్సి ఉండే.. కానీ, ఆరోగ్యం సహకరించకపోవడంతో నా ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారంట. డాక్టర్ల జర్నీ చేయవద్దని సూచించారని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నేను ఇండియాకు రాలేనని ప్రభాకర్ తెలిపారు. 

Also Read : రోడ్డు మధ్యలో దిగబడిన గ్రానైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లారీ 

పోలీసుల ఆరోపణలు, మీడియా లీకుల వల్ల తాను తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నానని ఆవేదన వ్యక్తి చేశారు. నా క్యారెక్టర్ దెబ్బ తీసేలా మీ చర్యలు ఉన్నాయని ఏసిపికి రాసిన లేఖలో పేర్కొన్నారు. సరైన టైంలో వైద్యం అందుకుంటే నా ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుందని వైద్యులు సూచించారు. తాను అక్రమంగా ఫోన్ ట్యాప్ చేయమని ఎవరికీ ఆదేశాలు ఇవ్వలేదని పేర్కొన్నారు. కేసు దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తానని, ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఇండియాకు వస్తానని తెలిపారు. వీడియో కాన్ఫరెన్స్, టెలికాన్ఫరెన్స్ ద్వారా సమాచారం ఇచ్చేందుకు రిటైర్డ్ ఐజీ ప్రభాకర్ సిద్ధంగా ఉన్నానని లేఖలో పేర్కొన్నారు.