వీడియో: సీఎం కార్టూన్ వాట్సాప్‌లో ఫార్వార్డ్ చేసినందుకు రిటైర్డ్ ఆర్మీ అధికారిపై దాడి

వీడియో: సీఎం కార్టూన్ వాట్సాప్‌లో ఫార్వార్డ్ చేసినందుకు రిటైర్డ్ ఆర్మీ అధికారిపై దాడి

సీఎంను కించపరిచేవిధంగా ఉన్న కార్టూన్‌ను వాట్సాప్‌లో ఫార్వార్డ్ చేసినందుకు ఆర్మీ మాజీ అధికారిపై కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ ఘటన ముంబైలోని కండివల్లిలో జరిగింది. ముంబైకి చెందిన 65 ఏళ్ల మదన్ శర్మ ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన ప్రస్తుతం ఈస్ట్ కండివల్లిలో ఉంటున్నారు. ఆయన తన సొసైటీ వాట్సాప్ గ్రూప్‌లో సీఎం ఉద్దవ్ ఠాక్రే కార్టూన్ ఫార్వార్డ్ చేశాడు. ఆ కార్టూన్ ఉద్దవ్ ఠాక్రేను కించపరిచే విధంగా ఉంది. అయితే ఆ కార్టూన్ పంపిన తర్వాత శర్మకు కమలేష్ కదమ్ అనే వ్యక్తి నుంచి ఫోన్ వచ్చింది. కమలేష్ ఫోన్‌లో శర్మ ఇంటి అడ్రస్ తెలుసుకున్నాడు. అయితే మధ్యాహ్నం సమయంలో కొంతమంది మదన్ శర్మ ఇంటి వద్దకు వచ్చి ఆయనను బయటకు పిలిచారు. దాంతో శర్మ ఇంటి నుంచి బయటకు వచ్చాడు. రాగానే కొంతమంది శివసేన కార్యకర్తలు ఒక్కసారిగా శర్మపై దాడికిదిగారు. వారి నుంచి తప్పించుకొని పారిపోవడానికి శర్మ ఎంతగానో ప్రయత్నించినా.. తప్పించుకోలేక వారి చేతికి చిక్కాడు. దాంతో శర్మ చొక్కా పట్టుకొని బయటకు లాక్కొచ్చి అందరూ కలిసి కొట్టారు. ఈ దాడిలో శర్మ ముఖం మీద మరియు కన్న మీద గాయాలయ్యాయి. ఈ ఘటన అంతా సొసైటీ గేట్ ముందు ఉన్న సీసీ కెమెరాలో రికార్డయింది. దాడికి తెగబడినవారందరూ మాస్కులు వేసుకున్నట్లు కనిపించింది. దాడిలో గాయపడ్డ శర్మ.. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

రిటైర్డ్ ఆర్మీ అధికారిపై శివసేన కార్యకర్తలు చేసిన ఈ దాడిని మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో సహా పలువురు బీజేపీ నాయకులు ఖండిస్తూ.. గాయపడిన మదన్ శర్మ ఫోటోను పోస్ట్ చేశారు. ‘ఇది చాలా విచారకరమైన మరియు దిగ్భ్రాంతికరమైన సంఘటన. కేవలం కార్టూన్ వాట్సాప్ ఫార్వార్డ్ చేశాడని రిటైర్డ్ నావల్ ఆఫీసర్ మీద దాడి జరిగింది. దయచేసి ఈ గుండాగిరిని ఆపండి ఉద్దవ్ ఠాక్రే జీ. దాడి చేసిన గూండాలపై కఠిన చర్యలు తీసుకొని శిక్ష విధించాలని మేం కోరుతున్నాం’ అని ఫడ్నవీస్ ట్వీట్ చేశారు.

అదేవిధంగా బీజేపీ ఎమ్మెల్యే అతుల్ భట్ ఖల్కర్ ఈ దాడిని ఖండిస్తూ.. ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నటి కంగనా రనౌత్ కార్యాలయాన్ని కూల్చివేసి తన మగతనాన్ని చూపించిన పాలక శివసేన.. ఇప్పుడు రిటైర్డ్ నేవీ అధికారిని కొట్టి గాయపరిచింది. ముఖ్యమంత్రి తన ఇంటి నుంచి నియంతృత్వ పాలనను నడుపుతున్నారు’ అని కండివాలి ఈస్ట్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అతుల్ భట్ఖల్కర్ ట్వీట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి కమలేష్ కదమ్ సహా మరో ఐదుగురిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు.

For More News..

బాలీవుడ్ డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్

వీడియో: టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ ముందే కొట్టుకున్న పార్టీ లీడర్లు

వీడియో: నన్ను నా భర్తతో పాటే దహనం చేయండంటూ షాపింగ్ మాల్‌పై నుంచి దూకిన నవవధువు