కోల్బెల్ట్,వెలుగు: 2025–26 ఆర్థిక సంవత్సరం ఆర్జించిన లాభాల్లో సింగరేణి పెన్షనర్లకు కూడా వాటా కల్పించాలని సింగరేణి రిటైర్డు ఉద్యోగులు డిమాండ్ చేశారు. బుధవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో రిటైర్డు ఉద్యోగుల సంఘం ప్రెసిడెంట్గజెల్లి వెంకటయ్య మాట్లాడుతూ మూడు దశాబ్దాల పాటు గనుల్లో ప్రాణాలను ఫణంగా పెట్టి బొగ్గు ఉత్పత్తి చేసి సంస్థ అభివృద్ధికి కృషి చేసిన రిటైర్డు ఉద్యోగులను ఆదుకోవాలన్నారు.
అరకొరగా పెన్షన్ పొందుతున్న రిటైర్డు ఉద్యోగులకు కూడా సంస్థ లాభాల్లో వాటా ఇప్పించేందుకు సీఎం, డిప్యూటీ సీఎం, సింగరేణి సీఎండీ, డైరెక్టర్లు చొరవచూపాలని కోరారు. సమావేశంలో సంఘం గౌరవ అధ్యక్షుడు రాళ్లబండి రాజన్న, ప్రధాన కార్యదర్శి పుదారి నర్సయ్య, ఉపాధ్యక్షులు ఎ.గంగయ్య, బూర్ల జ్ఞాని, లీడర్లు పి.రాంరెడ్డి , ఎ.అంజన్న, సత్యనారాయణరావు, గుజ్జ చందు, రాంచందర్, తదితరులు పాల్గొన్నారు
