పదవీ విరమణ చేసిన సుప్రీం కోర్టు CJI జస్టిస్ ఎస్ఏ బోబ్డే

పదవీ విరమణ చేసిన సుప్రీం కోర్టు CJI జస్టిస్ ఎస్ఏ బోబ్డే

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డే ఇవాళ(శుక్రవారం) పదవీవిరమణ చేశారు. బోబ్డే స్థానంలో  జస్టిస్ ఎన్వీ రమణ రేపు(శనివారం) నూతన సీజేఐగా బాధ్యతలు చేపట్టనున్నారు. బోబ్డే 2019లో CJIగా నియమితులయ్యారు. 1978లో ఆయన న్యాయవాద ప్రస్థానం ప్రారంభమైంది. తన కెరీర్ లో బాంబే హైకోర్టు అడిషనల్ జడ్జిగా, మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించారు.

2013లో ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా రిటైర్ అయ్యారు.