54 కార్పొరేషన్ల చైర్మన్లు ఔట్

54 కార్పొరేషన్ల  చైర్మన్లు ఔట్
  • 54 కార్పొరేషన్ల  చైర్మన్లు ఔట్
  • ఒకే జీవోతో అందరికీ ఉద్వాసన పలికిన కొత్త సర్కార్
  • లిస్ట్​లో తాటికొండ రాజయ్య, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, అల్లం నారాయణ, జూలూరు గౌరీశంకర్, వి.ప్రకాశ్​
  • ఆయా కార్పొరేషన్ల  వైస్​చైర్మన్లు, కాంట్రాక్టు, ఔట్‌‌సోర్సింగ్ స్టాఫ్​కు కూడా..
  • పీఏ, పీఎస్, ఓఎస్డీలు పేరెంట్ సంస్థలకు బదిలీ
  • ఈ నెల 7 నుంచే రద్దయినట్లు సీఎస్ ఉత్తర్వులు

హైదరాబాద్, వెలుగు : బీఆర్​ఎస్​ ప్రభుత్వ హయాంలో 54 కార్పొరేషన్లకు చైర్మన్లుగా, వైస్ చైర్మన్లుగా నామినేటెడ్ పద్ధతిలో నియమితులైన వాళ్ల  పోస్టులన్నింటినీ రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఒకే జీవోతో వారందరికీ ఉద్వాసన పలికింది. ఈ నెల 7వ తేదీ నుంచే ఇవి అమల్లోకి వచ్చాయంటూ సీఎస్​ శాంతికుమారి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఆఫీసుల్లో పీఏ, పీఎస్, ఓఎస్డీలుగా పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు వారి స్వంత డిపార్టుమెంట్లలోకి వెళ్లిపోవాలని అందులో ఆదేశించారు. 

ఆయా ఆఫీసుల్లో కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్ధతిలో నియమితులైన ఆఫీస్ సబార్డినేట్ స్టాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విధుల నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు. రాజీనామా చేస్తున్నట్లు ఇటీవల కొందరు కార్పొరేషన్ చైర్మన్లు ప్రకటించినప్పటికీ.. అధికారికంగా వారు రాజీనామా లెటర్లు ఇవ్వలేదు. కొందరు అలాగే కొనసాగుతుండటంతో ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్రంలోని మొత్తం 54 కార్పొరేషన్ల చైర్మన్లు, వైస్ చైర్మన్ల పోస్టుల్ని రద్దు చేస్తున్నట్లు ఆదివారం జీవో 1624ను విడుదల చేయడంతో.. వారు ఇక రాజీనామా చేయకుండానే వారి పదవులు రద్దు కానున్నాయి. 

ఇందులో మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, రైతు బంధు సమితి చైర్మన్ అండ్​ డైరెక్టర్ తాటికొండ రాజయ్య, ఆర్టీసీ చైర్మన్​ ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తెలంగాణ  సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్,  రాష్ట్ర ఉన్నత విద్య మండలి చైర్మన్  ప్రొఫెసర్ ఆర్​.లింబాద్రి, టూరిజం డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్​ యాదవ్, తెలంగాణ ఫుడ్స్ చైర్మన్  మేడే రాజీవ్ సాగర్, వికలాంగుల సహకార అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్, కల్లుగీత సహకార ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్, వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్​ వి.ప్రకాశ్, గొర్రెల-మేకల అభివృద్ధి ఫెడరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్,  గిడ్డంగుల కార్పొరేషన్ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పర్సన్ రజని తదితరులు ఉన్నారు.

పదవులు రద్దయిన చైర్మన్లు, వైస్​ చైర్మన్లు వీళ్లే..

  తిప్పన విజయసింహారెడ్డి:  స్టేట్ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్  
  డాక్టర్ తాటికొండ రాజయ్య: రైతు బంధు సమితి  చైర్మన్ అండ్​ డైరెక్టర్ 
  కొండబాల కోటేశ్వరరావు:  స్టేట్ సీడ్స్ 
    డెవలప్మెంట్ కార్పొరేషన్  చైర్మన్ 
  గట్టు తిమ్మప్ప :  స్టేట్ కో-ఆపరేటివ్ కన్జ్యూమర్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్ 
  మార గంగారెడ్డి : స్టేట్ మార్క్ ఫెడ్ చైర్మన్   
 కంచర్ల రామకృష్ణారెడ్డి: స్టేట్ కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ లిమిటెడ్​ చైర్మన్ 
  రాజా వరప్రసాద్ రావు  వానరస: స్టేట్ కోఆపరేటివ్ యూనియన్ లిమిటెడ్ చైర్మన్  
  వేద రజిని  సాయిచంద్:  స్టేట్ వేర్​ హౌసింగ్ కార్పొరేషన్  చైర్​పర్సన్​
 పిట్టల రవీందర్: స్టేట్ ఫిషరీస్ కో-ఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ లిమిటెడ్  చైర్మన్ 
   దీతి మల్లయ్య:  స్టేట్ ఫిషరీస్ కో-ఆపరేటివ్ సొసైటీ ఫెడరేషన్ లిమిటెడ్  వైస్ చైర్మన్​
  దూదిమెట్ల బాలరాజ్ యాదవ్: స్టేట్ షీప్ డెవలప్మెంట్ కోఆపరేషన్ ఫెడరేషన్ లిమిటెడ్  చైర్మన్   
  సోమ భరత్ కుమార్:  స్టేట్ డెయిరీ  డెవలప్మెంట్ కో ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్  చైర్మన్
  పల్లె రవికుమార్ గౌడ్ : స్టేట్ టాడి టాప్పర్  కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్  
  నందికంటి శ్రీధర్​: స్టేట్ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్  లిమిటెడ్  చైర్మన్ 
  అయాచితం శ్రీధర్:  స్టేట్​ గ్రంథాలయాలు పరిషత్ చైర్మన్ 
  సర్దార్  రవీందర్ సింగ్ :  స్టేట్ సివిల్ సప్లై     కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ 
  ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి  :  రాష్ట్ర ఉన్నత విద్య మండలి చైర్మన్  
  ప్రొఫెసర్ వి.వెంకటరమణ: రాష్ట్ర ఉన్నత విద్య మండలి వైస్​ చైర్మన్​
  ఏరువా సతీష్ రెడ్డి : స్టేట్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ 
  వంటేరు ప్రతాపరెడ్డి: స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ 
  అల్లం నారాయణ:  మీడియా అకాడమీ చైర్మన్ 
  ఎర్రోళ్ల శ్రీనివాస్: స్టేట్ మెడికల్​ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 
    డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్  చైర్మన్ 
  బొల్లం సంపత్ కుమార్ గుప్తా : స్టేట్ అండ్ క్రాఫ్ట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ 
  గూడూరి ప్రవీణ్ :  పవర్లూమ్ అండ్ టెక్స్టైల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ 
  మఠం భిక్షపతి: స్టేట్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్  చైర్మన్ 
  మెహమూద్  తన్వీర్​:  తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్​
  సముద్రాల వేణుగోపాలాచారి:  చైర్మన్ తెలంగాణ స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 
  వీరమల్ల ప్రకాశ్​రావు: చైర్మన్ తెలంగాణ వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 
  వి.దేవేందర్ రెడ్డి: స్టేట్ సోషల్ సెక్యూరిటీ బోర్డ్ ఫర్ అన్ ఆర్గనైజ్డ్ వర్కర్స్ చైర్మన్ 
  పి.నారాయణ : స్టేట్ మినిమం వేజెస్ అడ్వైజరీ బోర్డు చైర్మన్ 
  సంఘం రెడ్డి సుందర్ రాజ్ యాదవ్ : కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ లిమిటెడ్  చైర్మన్ 
  గూడూరు రామకృష్ణారావు: శాతవాహన 
    డెవలప్మెంట్ అథారిటీ (కరీంనగర్) చైర్మన్ 
  బాచు విజయ్ కుమార్ : స్థంభాద్రి అర్బన్ 
    డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ 
  సి.ప్రభాకర్ రెడ్డి: నిజామాబాద్​ అర్బన్ 
    డెవలప్మెంట్ అథారిటీ  చైర్మన్ 
  మారెడ్డి రవీందర్ రెడ్డి: సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్  
  గంజి వెంకన్న ముదిరాజ్​: మహబూబ్​నగర్ అర్బన్  డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ 
  మహమూద్ మసీదుల్లా ఖాన్ :  తెలంగాణ స్టేట్  వక్ఫ్  బోర్డు  చైర్మన్ 
  మహమూద్ సలీం: స్టేట్ హజ్ చైర్మన్  
  మహమ్మద్ ఖాజా ముజిబుద్దీన్: తెలంగాణ స్టేట్ ఉర్దూ  అకాడమీ  ప్రెసిడెంట్  
  మహమ్మద్ ఇంతియాజ్ ఇసాక్ : స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్  చైర్మన్  
  ఉప్పల వెంకటేశ్​: మిషన్ భగీరథ చైర్మన్ 
  నాగుల వెంకటేశ్వర్లు: స్టేట్ కమిషన్ ఫర్ డెబిట్ రిలీఫ్ స్మాల్ ఫార్మర్స్ అగ్రికల్చర్ లేబర్ అండ్ రూరల్ ఆర్టిజన్స్  చైర్మన్
  గజ్జల నగేశ్: స్టేట్ బేవరేజెస్ డెవలప్ మెంట్ 
    కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ 
  మెట్టు  శ్రీనివాస్:  స్టేట్ రోడ్స్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ 
  ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి : ఆర్టీసీ చైర్మన్​
  ఇస్లావత్ రామచందర్ నాయక్ : స్టేట్ షెడ్యూల్ ట్రైబ్స్  కోఆపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ 
  రమావత్ వాల్య నాయక్ : స్టేట్ గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్  చైర్మన్ 
  బండా శ్రీనివాస్: స్టేట్ షెడ్యూల్ క్యాస్ట్ కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్  చైర్మన్  
  డాక్టర్ కె.వాసుదేవారెడ్డి: స్టేట్ వికలాంగుల కో-ఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్  
  మేడి రాజీవ్ సాగర్: తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ 
  ఆకుల లలిత: స్టేట్ ఉమెన్స్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్ పర్సన్ 
  గెల్లు  శ్రీనివాస్ : స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ 
  దీపికా రెడ్డి : తెలంగాణ సంగీత నాటక అకాడమీ  చైర్ పర్సన్  
  జూలూరు గౌరీ శంకర్ : తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్  
  డాక్టర్ ఆంజనేయ గౌడ్ :  స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ (సాట్స్) చైర్మన్