భట్టి దీక్షకు ఎంపీ రేవంత్ రెడ్డి సంఘీభావం

భట్టి దీక్షకు ఎంపీ రేవంత్ రెడ్డి సంఘీభావం

ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో ప్రజా పరిరక్షణ ఆమరణ దీక్షచేస్తున్న మల్లు భట్టి విక్రమార్కకు మద్దతు పలికారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి. సీఎల్పీని విలీనం చేశామని కేసీఆర్ తాత్కాలిక ఆనందం పొందుతున్నారని రేవంత్ అన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ సమస్య మాత్రమేకాదు.. ఇది తెలంగాణ ప్రజల సమస్య అన్నారు. “2016 లో టీడీఎల్పీని టీఆర్ఎస్ లో విలీనంచేసినప్పుడు నేను కోర్టుకు వెళ్లా. టీడీఎల్పీ విలీనం చెల్లదనీ.. పార్టీ మారిన ఎమ్మెల్యే లను సస్పెండ్ చేయాల్సి ఉంటుందని కోర్టు చెప్పింది. ఒక పార్టీ ఎమ్మెల్యేలు వేరే పార్టీలో విలీనం కావాలంటే.. పార్టీ నాయకుల తీర్మానం చేస్తే.. ఎన్నికల కమిషన్ కు మాత్రమే విలీనం చేసే అధికారం ఉంటుంది. స్పీకర్ నిర్ణయం చెల్లుబాటు కాదు. రాష్ట్రంలో కల్వకుంట్ల రాజ్యాంగం ఎంతోకాలం నడవదు. ఎమ్మెల్యేల పిరాయింపుల మీద ఉన్న దృష్టి.. కేసీఆర్ కు ప్రజా సమస్యల మీద లేదు. సభలో ప్రజా సమస్యల మీద ప్రశ్నిస్తారని భట్టికి clp లేకుండా చేశారు. సీఎల్పీని విలీనంపై అసెంబ్లీలో బదులిస్తాం” అన్నారు.