KTR ఐటీ మంత్రిగా ఉన్నప్పుడే గ్లోబరీనాకు టెండర్లు: రేవంత్ రెడ్డి

KTR ఐటీ మంత్రిగా ఉన్నప్పుడే గ్లోబరీనాకు టెండర్లు: రేవంత్ రెడ్డి

KTR ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే గ్లోబరీనా, మ్యాగ్నటిక్ సంస్థలకు టెండర్ లు ఇచ్చారని కాంగ్రెస్ లీడర్ రేవంత్ రెడ్డి అన్నారు. గ్లోబరీనా తనకు తెలువదంటూ ప్రజలను కేటీఆర్ మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు. గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన రేవంత్ టెండర్ నిబందనలకు విరుద్ధంగా గ్లోబరీనా కు టెండర్లు ఎలా కట్టబెట్టారని ప్రశ్నించారు. గ్లోబరీనా, మ్యాజెస్టిక్ సంస్థలు రెండూ ఒకటే అని.. 2016 ఎంసెట్ లీకేజీ కుంభకోణంలో మ్యాజెస్టిక్ సంస్థ పై కాకినాడ జేఎన్‌టీ‌యూ  కేసు పెట్టిందని చెప్పారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థను పక్కన పెట్టి ఇలాంటి సంస్థలకు ఇంటర్ బాధ్యతలను ఎలా అప్పగిస్తారని అన్నారు రేవంత్ .

ఇంటర్ రిజల్ట్స్ లో అవకతవకల వలన 10 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకం అయిందన్నారు రేవంత్. ఆత్మహత్య చేసుకున్న ప్రతీ విద్యార్థి కుటుంబానికి 50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 24 గంటల్లో ఇంటర్ రిజల్ట్స్ లో అవకతవలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. లేకపోతే NSUI, యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గాంధీ భవన్ లో 48 గంటల దీక్ష చేస్తామని తెలిపారు రేవంత్ రెడ్డి.