
- ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల ఊబిలోకి నెట్టారు
- కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఫైర్
శివపల్లి: ధనిక రాష్ట్రమైన తెలంగాణను సీఎం కేసీఆర్ పూర్తిగా అప్పుల ఊబిలోకి నెట్టేశారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం శివపల్లిలో కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు.
తెలంగాణలో పుట్టబోయే బిడ్డపై కూడా లక్ష రూపాయల భారం మోపిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రూ.16 వేల కోట్ల మిగులు బడ్జెట్ తో అప్పగించిందన్నారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక ప్రజల సొమ్మును భారీగా దుబారా చేశారన్నారు. దీనిని కాగ్ కూడా తప్పుపట్టిందని రేవంత్ గుర్తు చేశారు. బరితెగించి ఇంకా అప్పులు చేస్తానంటున్న కేసీఆర్ హుజూర్ నగర్ ఉప ఎన్నికను ప్రభుత్వ పనితీరుకు రెఫరెండంగా స్వీకరించాలని డిమాండ్ చేశారు.