
హత్యలు, లైంగిక దాడులకు అమలు చేసే కఠిన శిక్షలను పార్టీ ఫిరాయించిన వారికీ వర్తింపజేయాలని పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలను తెలిపారు. అనంతరం రేవంత్ మాట్లాడారు. ఎమ్మెల్యే పార్టీ ఫిరాయిస్తే వారి సభ్యత్వం రద్దు చేయాలని చెప్పారు. అవసరమైతే ఉరి తీసే విధానాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. పార్టీ ఫిరాయింపుల పట్ల కఠిన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేశారు. ఈ అంశంపై రాజ్యాంగంలో సవరణ తీసుకు రావాల్సిన విషయాన్ని మేధావులు ఆలోచించాలని విన్నవించారు. ఇవాళ హాత్ సే హాత్ జోడో యాత్ర లాంఛనంగా ప్రారంభించినా ఫిబ్రవరి 6 నుంచి 60రోజులపాటు కొనసాగుతుందని చెప్పారు.