టీఆర్ఎస్ ప్లీనరీకి పెట్టుబడి పెట్టింది ఆంధ్రా కాంట్రాక్టర్లే

టీఆర్ఎస్ ప్లీనరీకి పెట్టుబడి పెట్టింది ఆంధ్రా కాంట్రాక్టర్లే

ఉద్యమ సమయంలో తెలుగు తల్లిని తిట్టిన సీఎం కేసీఆర్.. టీఆర్ఎస్ ప్లీనరీలో తెలుగు తల్లి ఫోటో పెట్టారన్నారు కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తెలంగాణ తల్లిపోయి తెలుగు తల్లి వచ్చిందన్నారు. టీఆర్ఎస్ ప్లీనరీకి పెట్టుబడి పెట్టిందే ఆంధ్రా కాంట్రక్టర్లన్నారు. ఆంద్రా కాంట్రాక్టర్ల మెప్పుకోసమే తెలుగుతల్లి ఫోటో పెట్టారన్నారు.  ప్లీనరీలో కొండాలక్ష్మణ్ బాపూజీని టీఆర్ఎస్ మరిచిపోయిందన్నారు. కేసీఆర్ కు చదువు చెప్పిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ పేరును కూడా ఎక్కడా ప్రస్తావించలేదన్నారు. ఎంతోమంది మేధావులు, టీఆర్ఎస్ నిర్మాణంలో, కేసీఆర్ ఎదుగుదలకు  దోహదపడిన వారిని ప్లీనరీలో విస్మరించారన్నారు. 2001 నుంచి వెన్నంటి  ఉన్న ఈటలను పార్టీ నుంచి బయటకు వెలివేశాడన్నారు. అటు హరీశ్ రావును పార్టీ ప్లీనరీకి రాకుండా హుజురాబాద్ కే పరిమితం చేశారన్నారు.  పార్టీలో తండ్రీకొడుకుల ఫోటోలు మాత్రమే ఉండాలని కేసీఆర్ కుట్ర అన్నారు. ఈ నెల 30 తర్వాత తన పరిస్థితి ఏమైతుందోనని హరీశ్ రావు భయంతో బతుకుతున్నాడన్నారు..భయంతో బతికే బతుకెందుకని హరీశ్ రావును ప్రశ్నించారు. హరీశ్ ఈ గొడ్డుచాకిరీ ఎక్కడా చేసినా బాగుంటారని..పూలు అమ్మిన చోట కట్టెలు అమ్మే పరిస్థితి హరీశ్ రావుకు ఎందుకు అని అన్నారు.

తెలంగాణలో వచ్చినపుడు లక్షా 7 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే..ఈ ఏడున్నరేళ్ల టీఆర్ఎస్ పరిపాలనలో 1, 91, 732 ఖాళీలు ఉన్నాయన్నారు. టీఆర్ఎస్ పాలనలో ఉద్యోగ నియామకాల కంటే..పదవి విరమణ పొందిన వాళ్లే దాదాపు 85 వేల మంది ఉన్నారని అధికారిక లెక్కలు చెబుతున్నాయన్నారు. దీనిపైన చర్చకు సిద్దమా? అని సవాల్ విసిరారు.