
ప్రజలను తప్పుదోవ పట్టించడంలో కేసీఆర్ నిపుణులన్నారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. చాలా భవనాలు 30 నుంచి 35 ఏళ్ల లోపువేన్నారు. హైదరాబాద్ చరిత్ర పురాతన కట్టడాలతో ముడిపడి ఉందన్నారు. కేసీఆర్ విలాసాల కోసమే కొత్త నిర్మాణాలన్నారు. సహజ వనరులను సీఎం విధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఏం చేసినా చూస్తు కూర్చోమని హెచ్చరించారు. మిలియన్ మార్చ్ కు పిలుపివ్వాలని కోదండరాంకి విజ్ఞప్తి చేశారు.