బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌కు పాలించే హక్కు లేదు.. రేవంత్ రెడ్డి ఫైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌కు పాలించే హక్కు లేదు.. రేవంత్ రెడ్డి ఫైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌వి అన్నీ అబద్ధాలేనని, ఆ పార్టీకి పాలించే హక్కు లేదని పీసీసీ చీఫ్‌‌‌‌‌‌‌‌ రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రజలకు ఆ పార్టీ చేసిన మోసాలపై ఆదివారం ట్విట్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మండిపడ్డారు. ‘‘అబద్ధాలే మీ ఆయుధాలు. వంచనలే మీ సిద్ధాంతాలు. నాటకాలే మీకు తెలిసిన విద్యలు. మీరు ఇచ్చి తప్పిన హామీలకు లెక్కలేదు. మీకింకా పాలించే హక్కు లేదు. ఈ గడ్డ మరువదు మీరు పెట్టిన గోస. మీపై లేనే లేదు భరోసా. ముక్కు నేలకు రాసినా.. పొర్లిపొర్లి దండాలు పెట్టినా పారవు మీ పాచికలు. 

తప్పవు మీకు శంకరగిరి మాన్యాలు’’అంటూ కామెంట్ చేశారు. కాగా, రేవంత్ సమక్షంలో పలు విద్యార్థి సంఘాలకు చెందిన ఉద్యమకారులు, పలువురు నేతలు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో చేరారు. ఓయూ నేత కోట శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఓయూ, కేయూ విద్యార్థి సంఘాల నేతలు, రీసెర్చ్ స్కాలర్స్ పార్టీ కండువా కప్పుకున్నారు. 

తెలంగాణ విద్యార్థి సంఘం స్టేట్ వైస్ ప్రెసిడెంట్ పెంచాల సతీశ్, ఎస్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐ ఓయూ మాజీ అధ్యక్షుడు మాండ్ల రవి, టీవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మోహన్ రాజ్, తెలంగాణ విద్యార్థి సంఘం కాకతీయ యూనివర్సిటీ నాయకుడు కూనూరి రంజిత్, టీఎస్‌‌‌‌‌‌‌‌పీ జేఏసీ స్టేట్ చైర్మన్​ కె.చంద్రశేఖర్, ఇతర విద్యార్థి సంఘాల నేతలు కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌లో చేరారు. అలాగే, నారాయణపేట జడ్పీ చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్ వనజ దంపతులు అనుచరులతో కలిసి రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.