పంపకాల్లో తేడా.. హరీష్,ఈటల మధ్య మాటల యుద్ధం

పంపకాల్లో తేడా.. హరీష్,ఈటల మధ్య మాటల యుద్ధం

బీజేపీ, టీఆర్ఎస్ కలిసే దళితబంధు నిలిపివేశాయన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. పంపకాల్లో తేడా వచ్చినందు వల్లే ఈటల, హరీశ్ మధ్య మాటల  యుద్ధమన్నారు. దళితులకిచ్చిన ఏ హామీ నెరవేర్చని నీచుడు కేసీఆర్.. అని అన్నారు. సొంత చెల్లినే గెలిపించుకోలేని కేటీఆర్ ఏం ముఖం పెట్టుకుని మాట్లాడుతున్నారన్నారు రేవంత్. తలుపులు మూసుకుని మాట్లాడటం కాదు దమ్ముంటే కేటీఆర్ బయటికి రావాలన్నారు. హుజురాబాద్ పోలీసులపై బుద్ధభవన్ లో ఈసీకి ఫిర్యాదు చేశారు రేవంత్. టీఆర్ఎస్ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్న కొందరు పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని చీఫ్ ఎలక్ట్రోల్ ఆఫీసర్ శశాంక్ గోయల్ ను కోరారు. హరీశ్ రావు రెచ్చగొట్టడం వల్లే పోలీసులు నిరుద్యోగ యువతి నిరోశను కొట్టారన్నారు రేవంత్.  నవంబర్ 15 లోపు కేటీఆర్ బహిరంగ చర్చకు రావాలి. ఎన్నికల సమయంలో రైతుబంధుకు లేని అడ్డంకి.. దలితబందుకు ఎందుకన్నారు.

మరిన్ని వార్తల కోసం

టైరు పేలి బైక్‌ను ఢీ కొట్టిన కారు.. ముగ్గురు మృతి

హుజురాబాద్‌లో కాంగ్రెస్, బీజేపీ కలిసిపోయినయ్‌