డీకే శివకుమార్‌‌తో రేవంత్ భేటీ!

డీకే శివకుమార్‌‌తో రేవంత్ భేటీ!

న్యూఢిల్లీ, వెలుగు:  మంగళవారం రాత్రి 10.10 గంటలకు ప్రత్యేక విమానంలో రేవంత్ ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడ ఆయనకు తెలంగాణ భవన్ అధికారులు స్వాగతం పలికారు. ఎయిర్‌‌పోర్ట్ బయట రేవంత్ అభిమానులు.. ‘జై రేవంత్’ అంటూ నినాదాలు చేశారు. 

తెలంగాణ భవన్ అధికారులు బుల్లెట్ ప్రూఫ్ వాహనం, కాన్వాయ్‌ని ఏర్పాటు చేయగా.. తన సొంత వాహనంలోనే రేవంత్ వెళ్లారు. భద్రతగా పోలీస్ కాన్వాయ్ వెంట వెళ్లింది. రాత్రి డీకే శివకుమార్‌‌తో రేవంత్ భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య సమావేశం అర గంటకు పైగా సాగింది. ఎంపీ మాణిక్కం ఠాగూర్​తోనూ రేవంత్​ భేటీ అయ్యారు.