ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి రేవంత్ రెడ్డి అభినందనలు

ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి రేవంత్ రెడ్డి అభినందనలు

నాటు నాటు పాటకు అంతర్జాతీయ స్థాయి అవార్డు రావడం గర్వకారణంగా ఉందని పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి తెలిపారు. ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు సాంగ్ కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు రావడంపై.. చిత్రం యూనిట్ కు రేవంత్ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు సినిమా స్థాయి ప్రపంచం గుర్తించే విధంగా ఎదిగినందుకు సంతోషంగా ఉందన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా నిర్మాతలకు, దర్శకుడికి, పాట రచయిత, గాయకులకు హృదయ పూర్వక అభినందనలు తెలిపారు. ఈ అవార్డు రావడం తెలుగు చిత్ర రంగానికి గర్వకారణం అన్నారు.

ఇక ప్రస్తుతం గోల్డెన్ గ్లోబ్ అవార్డులు–2023 కార్యక్రమం కాలిఫోర్నియాలో జరుగుతోంది. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఈ అవార్డును అందుకున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర బృందానికి పలువురు సినీ,రాజకీయ ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు. ఈ అవార్డుల ప్రదానోత్సవంలో డైరెక్టర్ రాజమౌళి, నటుసు రామ్ చరణ్‌, జూనియర్ ఎన్టీఆర్‌, కీరవాణి కుటుంబసమేతంగా పాల్గొని సందడి చేశారు.