‘బోధి’ ఆఫీసును మీడియాకు చూపించిన సీఎం

‘బోధి’ ఆఫీసును మీడియాకు చూపించిన సీఎం

హైదరాబాద్, వెలుగు: ఎంసీఆర్‌‌‌‌హెచ్‌‌ఆర్డీ బోధి పెవిలియన్‌‌లోని సీఎం కార్యాలయాన్ని రూ.100 కోట్లతో నిర్మించారని, కేవలం గేట్ల కోసమే రూ.17 కోట్లు ఖర్చు పెట్టారంటూ వచ్చిన ఆరోపణలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందిం చారు. శనివారం మీడియా సమావేశం అనం తరం జర్నలిస్టులకు తన కార్యాలయంలోని అన్ని రూమ్‌‌లను కలియ తిప్పి చూపించారు.

ఇందులో ఖరీదైనవి ఏమున్నాయో చెప్పాలని మీడియా ప్రతినిధులను అడిగారు. ఎంసీఆర్‌‌‌‌హెచ్‌‌ఆర్డీకి సీఎం చైర్ పర్సన్ అని అదే హోదాలో ఇక్కడ ఆఫీస్ ఉంటుందని చెప్పారు. తాను సీఎంగా దిగిన తర్వాత కూడా అది అలాగే ఉంటుందని తాను వచ్చి సొంతం చేసుకునేది కాదని స్పష్టం చేశారు.