మోడీని, కేసీఆర్ ను గద్దె దించినప్పుడే నిజమైన స్వాతంత్య్రం

మోడీని, కేసీఆర్ ను గద్దె దించినప్పుడే  నిజమైన స్వాతంత్య్రం

కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో కేసీఆర్ ను ఓడించినప్పుడే రైతులకు, యువతకు నిజమైన స్వాతంత్య్రం అన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఇద్దరిని గద్దె దించేందుకు ఇందిరాగాంధీ స్ఫూర్తితో పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్ గాంధీభవన్ లో పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొన్నారు రేవంత్ రెడ్డి.   రాష్ట్రంలో నిరుద్యోగ యువత ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉందన్నారు. పోడు భూములకు కాంగ్రెస్ పట్టాలిస్తే..హరితహారం పేరుతో అటవీశాఖ అధికారులు గుంజుకున్నారని విమర్శించారు. చంటిపిల్లలున్న ఆడబిడ్డలను జైలుకు పంపి పాశవికంగా వ్యవహరించారని  మండిపడ్డారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, అఖండ భారత్ గా నిలబెట్టే శక్తి కాంగ్రెస్ కే ఉందన్నారు రేవంత్.