కరెంటు కొనుగోళ్లపై విచారణ జరిపించాలి: రేవంత్ రెడ్డి

కరెంటు కొనుగోళ్లపై విచారణ జరిపించాలి: రేవంత్ రెడ్డి

రాష్ట్రంలో కరెంట్ కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలన్నారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. విద్యుత్ సంస్థల్లో అక్రమాలకు సహకరించని వారిని ప్రభుత్వం బదిలీ చేసింది ఆరోపించారు. తప్పుడు ఒప్పందాలపై సంతకాలు చేయని వారిపై వేటు వేశారని చెప్పారు రేవంత్. సంస్థలో అనుభవంలేని, అసమర్థులైన అధికారులను నియమించారని విమర్శించారు. విద్యుత్ సంస్థలు 74 వేల కోట్ల అప్పులు చేశాయని చెప్పారు. కరెంట్ కోనుగోలు పేరుతో విద్యుత్ సంస్థలను నిండా ముంచుతున్నారని మండిపడ్డారు. కావాలని కొంత మంది ఉద్యోగులను రెచ్చగొట్టి… తమ దిష్టిబొమ్మలను దహనం చేయిస్తున్నారని విమర్శించారు రేవంత్ రెడ్డి.