మోడీకి చట్ట సభలపై గౌరవం లేదు

మోడీకి చట్ట సభలపై గౌరవం లేదు

పార్లమెంట్ లో మాట్లాడిన ప్రధాని మోడీ స్పీచ్ ను తీవ్రంగా  ఖండించారు  టీపీసీసీ రేవంత్ రెడ్డి. మోడీ తెలంగాణ జాతికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మోడీ దేశానికి ప్రధానిగా ఉండడం దూరదృష్టకరమన్న రేవంత్.. కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. తెలంగాణకు విభజన హామీలు నెరవేర్చలేదన్నారు. హామీలు నెరవేర్చ లేని వ్యక్తి దేశ ప్రధానిగా ఉండే అర్హత లేదన్నారు.చట్ట సభలపై ఆయనకు గౌరవం లేదన్నారు. తెలంగాణపై చిన్న చూపు చూసేలా మోడీ ప్రసంగం సాగిందని తెలిపారు. మేనేజ్మెంట్ స్కిల్స్ తో మోడీ ప్రధాని అయ్యారని చెప్పారు.తన గురువైన అద్వానీని మోసం చేసి...  గుజరాత్ కు మోడీ సీఎం అయ్యారని ఆరోపించారు.

1997 కాకినాడ లో ఒక ఓటుకు రెండు రాష్ట్రాలు ఇస్తామని బిజెపి తీర్మానం చేసిందన్న రేవంత్ రెడ్డి..1999 లోక్ సభ ఎన్నికల్లో 7 స్థానాలు బీజేపీ  గెలిస్తే, నాలుగు తెలంగాణ ప్రాంతం నుంచి గెలిచారని తెలిపారు. కానీ..1999 లో బీజేపీ తెలంగాణ ఇవ్వలేదని విమర్శించారు. తెలంగాణ మలి ఉద్యమంలో 1200 మంది విద్యార్థుల బలిదానాలకు బీజేపీ  బాధ్యత వహిస్తూ క్షమాపణలు చెప్పాలన్నారు. అప్పుడే తెలంగాణను బీజేపీ ఇచ్చి ఉంటే విద్యార్థులు చనిపోయేవారు కాదని అన్నారు. చట్ట సభల్లో క్షమాపణ చెప్పి.. తప్పు ఒప్పుకుంటేనే మోడీ మర్యాద పెరిగేదన్నారు. మోడీ ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే కనీసం కేసీఆర్,టీఆర్ ఎస్  ఎంపీలు మాట్లాడటం లేదు

ఆరు దశాబ్దాల ప్రజల ఆకాంక్షల మేరకు సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారని తెలిపారు రేవంత్ రెడ్డి.మోడీ ఇష్టానుసారంగా మాట్లాడుతుంటే కనీసం కేసీఆర్,టీఆర్ఎస్  ఎంపీలు ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు.

 

మరిన్ని వార్తల కోసం...

 

లతా జీ అంత్యక్రియల్లో షారుక్ చేసింది తప్పేనా?